Fiber
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వివిధ రకాల పోషక పదార్ధాలు అవసరమౌతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం ఎప్పుడూ ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలి. మనిషి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే పోషకాల్లో విటమిన్లు, మినరల్స్‌తో పాటు అతి ముఖ్యమైంది ఫైబర్. మనిషి ఆరోగ్యం అనేది ఎప్పుడూ శరీరపు మెటబాలిజంపై ఆధారపడి ఉంటుంది. తీసుకునే ఆహారంలో ఫైబర్ సమృద్దిగా ఉంటే ఏ విధమైన అనారోగ్యం దరిచేరదు. సంపూర్ణ ఆరోగ్యానికి ఫైబర్ తప్పనిసరి. అందుకే సాధ్యమైనంతవరకూ ఫైబర్ ఉండే పదార్ధాలనే తీసుకోవాలంటారు వైద్యులు. బరువును కంట్రోల్లో ఉంచడంలో, జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడానికి ఫైబర్ చాలా ముఖ్యమైనది.
ఫైబర్ తప్పనసరి…కొంపముంచే కొలెస్ట్రాల్ Fiber
మనిషి అనారోగ్యానికి కారణమయ్యే పలు కారకాల్లో కొలెస్ట్రాల్ అత్యంత ప్రమాదకరమైంది. ఎందుకంటే కొలెస్ట్రాల్ ఒక్కటే ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గాలంటే తీసుకునే ఆహారంలో ఫైబర్ పుష్కలంగా ఉండేట్టు చూసుకోవాలి. ఇక మరొకటి డయాబెటిస్. ఇప్పటికీ సరైన చికిత్స లేకపోవడంతో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. మధుమేహం నియంత్రణ అనేది పూర్తిగా మన చేతుల్లో, మన ఆహారపు అలవాట్లపైనే ఉంటుంది. తీసుకునే ఆహారంతో ఫైబర్ ఎక్కువగా ఉంటే మధుమేహం చాలావరకూ తగ్గుతుంది. దీనికోసం ఫైబర్ అధికంగా ఉండే పదార్ధాలు తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయి తగ్గుతుంది.
ఫైబర్ వల్ల లాభాలు… Fiber
ఆహారంలో ఫైబర్ తగిన మోతాదులో ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ బాగుంటుంది. ఎప్పుడైతే జీర్ణక్రియ సక్రమంగా ఉంటుందో గ్యాస్, ఉబ్బరం, అజీర్తి సమస్యలు తలెత్తవు. దీనికోసం పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు దోహదపడతాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటే మలబద్ధకం సమస్య కూడా పోతుంది. ఇక గుండె సంబంధిత వ్యాధులు తగ్గించేందుకు కూడా ఫైబర్ బాగా ఉపయోగపడుతుంది. రోజూ తీసుకునే ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే ఫైబర్ తగిన మోతాదులో ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అన్ని రకాల కూరగాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పండ్లలో జామ, ఆపిల్, బొప్పాయి, బత్తాయిల్లో ఫైబర్ కావల్సినంత లభిస్తుంది. మెటబాలిజంకి ఫైబర్ కీలకం మెటబాలిజం వృద్ధి చెందాలంటే ఫైబర్ చాలా ముఖ్యం అందుకే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటుండాలి.
బరువు తగ్గుతారు.. Fiber
ఫైబర్స్ మన శరీరంలోని గట్ బాక్టీరియాను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఫైబర్ రిచ్ డైట్ మన కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. త్వరగా ఆకలి వేయకుండా నియంత్రిస్తుంది.. తద్వారా అతిగా తినకుండా కంట్రోల్లో ఉంటాం. ఫైబర్ శరీరంలోని కొవ్వు త్వరగా కరగడానికి సహాయపడుతుంది, బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.
బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచుతుంది.. Fibe
ఫైబర్ రిచ్ డైట్ బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచుతుంది. ఎందుకంటే మానవ శరీరం ఫైబర్‌ను గ్రహించుకోలేదు, విచ్ఛిన్నం చేయలేదు. ఇది కార్బోహైడ్రేట్ల కారణంగా రక్తంలో పెరిగే చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతుంది. ఆహారం త్వరగా జీర్ణం కాకుండా చూస్తూ రక్తంలోకి గ్లూకోజు నెమ్మదిగా వెళ్లేలా చేస్తుంది. వైద్యులు సాధారణంగా 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ప్రతిరోజూ 22-35 గ్రాముల ఫైబర్ తీసుకోవాలని సిఫార్సు చేస్తారు.
క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది..
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్లలో లభించే ఫైబర్ కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు. నీటిలో కరిగే పీచు మృదువుగా ఉంటుంది. నీటిని పీల్చుకోవటం ద్వారా ఇది మల పదార్థం ఏర్పడేలా, విసర్జన సాఫీగా సాగేలా చేస్తుంది. రెగ్యులర్ ప్రేగు కదలికలు హానికరమైన పదార్థాలు పెద్దప్రేగు లైనింగ్‌తో ఎక్కువ సేపు ఉండి డ్యామేజీ కాకుండా ఫైబర్అడ్డుపడుతుంది.. మలాన్ని నేరుగా బయటకు నెట్టేసే శక్తి ఫైబర్ కి ఉంటుంది.. ఇది కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. Fiber