ప్రపంచవ్యాప్తంగా ఇటీవల విడుదలైన పాన్-ఇండియా ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా వరుస వివాదాలలో చిక్కుకుంది. ఆ సినిమా డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లాను అలాహాబాద్ హై కోర్ట్ తీవ్ర స్థాయిలో మందలించింది. ఈ కేసులో సహ-రచయిత అయిన మనోజ్ ముంతాషిర్ శుక్లాను బాధ్యత వహిస్తూ వారంలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందూ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందించిన పౌరాణిక యాక్షన్ చిత్రం ‘ఆదిపురుష్’పై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ కోర్టులో దాఖలైన వ్యాజ్యం పై విచారణ జరిపిన అలాహాబాద్ హైకోర్టు సినిమా దర్శక నిర్మాతల పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Bench (dictating order): Let dialogue writer of the movie Manoj Muntashir Shukla (@manojmuntashir) be impleaded as party respondent in the PIL plea and let notices be issued to him#Adipurush #AdipurushRow #AllahabadHighCourt
— Live Law (@LiveLawIndia) June 27, 2023
ప్రజలు తిరగబడకపోవడం ఆశ్చర్యం కలిగించింది..
సినిమా ని (Adipurush) థియేటర్ కి వెళ్లి చుసిన ప్రేక్షకులు ఎటువంటి గొడవ చేయకుండా ఇంటికి వెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగించిందని, వాళ్ళు తలుచుకుంటే పెద్ద గొడవే జరిగి థియేటర్ లను ధ్వంసం చేసి ఉండేవారని కానీ ఆలా చేయకపోవడం ఒక మంచి పరిణామం అని కోర్ట్ అభిప్రాయ పడింది.
Bench: Jo seedha hai use dabaiye, aisa hai kya? Wo to shukra hai ki logon ne koi law and order situation nahin create hui. Humne news mein dekha ki kuch log cinema hall gaye aur sirf band karwa kar chale aaye, wo kuch aur bhi kar sakte the.#Adipurush #AllahabadHighCourt
— Live Law (@LiveLawIndia) June 27, 2023
దేశ ప్రజలను పిచ్చోళ్లని అనుకుంటున్నారా..?
సినిమా ముందుగా డిస్క్లెయిమర్ పెట్టామన్న నిర్మాతలు వ్యాఖ్యల పై ధర్మాసనం తప్పు పట్టింది, “మీరు రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు, లంకను చూపించి, అది రామాయణం కాదని అంటున్నారా? , మీ దృష్టిలో ఈ దేశ ప్రజలు పిచ్చోళ్లు అనుకుంటున్నారా” అని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Bench: Kya yeh disclaimer dene wale country ko, youth ko bewakoof samajhte hain?
Picture agar ruk jayegi to jinki feelings hurt hui hain unhe rahat milegi.
Aap wahi Lord Rama, Lord Laxman, Lord Hanuman, wahi Ravana, wahi Lanka dikhaiye aur kahiye ki yeh Ramayana nahin?
— Live Law (@LiveLawIndia) June 27, 2023
Follow Us On : YouTube , Google News