ముఖ్యమంత్రి జగన్ (Jagan) శ్రీకాకుళం లో జరిగిన జగనన్న అమ్మ వోడి కార్యక్రమంలో పాల్గొన్నారు. గత కొద్దీ రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి (Varahi) యాత్ర లో సీఎం జగన్ మరియు వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులు పై దుర్భాషలు ఆడుతూ తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తూ వస్తున్నారు . ఆ విమర్శలకు ఈరోజు జరిగిన కార్యక్రమంలో పవన్ కు సీఎం జగన్ గట్టిగానే సమాధానం ఇచ్చారు. పవన్ అనే పేరు ఎక్కడ పలకకుండా ప్యాకేజిస్టార్ మరియు దత్తపుత్రుడు అనే పేర్లను వాడుతూ జనసేనాని పై వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలను సంధించారు.
వారాహి ని సింపుల్ గా లారీ అని తేల్చేసిన సీఎం జగన్
సభలో సీఎం జగన్ మాట్లాడుతూ , “ఈ ప్యాకేజీ స్టార్ ఈరోజు ఓ లారీ (Varahi) ఎక్కి మాములుగా కాకుండా ఊగిపోతూ తనకు నచ్చని వాళ్ళని చెప్పుతో కొడతా అంటాడు, తాట తీస్తా అంటాడు, గుడ్డలు ఊడదీసి తంతా అంటాడు అని , ఈ మనిషి నోరుకి అదుపులేదు, నిలకడ లేదని పవన్ ను ఉదీసించి విమర్శించారు. పవన్ ని ఉద్దేశిస్తూ వారిలా మనం పూనకం వచ్చినవారిలా ఊగిపోతూ మాట్లాడలేం, వారిలా మనం బూతులు మాట్లాడలేం, వారిలా మనం రౌడీ ల మాదిరిగా మీసాలు మెలేయలేం” అని సీఎం జగన్ అన్నారు
పవన్ ల నాలుగేళ్లకోసారి భార్యల్ని మార్చలేం…
ఈ ప్యాకేజీ స్టార్ ల వైస్సార్సీపీ వాళ్ళు ఎవ్వరు నాలుగు నాలుగు పెళ్లి చేసుకోలేరని , నాలుగేళ్లకోసారి భార్య లని మార్చలేమని పవన్ ను ఉద్దేశిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేసారు సీఎం జగన్. సీఎం కామెంట్స్ కి జనసేన అధినేత పవన్ ఏయ్ విధంగా సమాధానం ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.
లారీ ఎక్కి ఊగిపోతూ మాట్లాడలేం
బూతులు తిట్టలేం
తొడలు కొట్టలేం
మీసాలు మెలేయలేం
4 పెళ్లిళ్లు చేసుకుని పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకు తీసుకురాలేం
అవన్నీ ఆ ప్యాకేజ్ స్టార్ కి పేటెంట్ #JaganannaAmmaVodi #YSJaganAgain #PackageStarPK pic.twitter.com/Z6i88rXBEo— Sajjala Bhargava Reddy (@SajjalaBhargava) June 28, 2023
Follow Us On : YouTube , Google News