పాన్ ఇండియా మెగా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ చిత్రం టీజర్ విడుదల తేదీ ని ఆ సినిమా ప్రొడ్యూసర్ ప్రకటించారు. ప్రభాస్ గత చిత్రం ఆదిపురుష్ అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోయేసరికి నిరాశకు లోనైన ప్రభాస్ అభిమానులు మాత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సలార్ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు. కెజిఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ తీసిన సినిమా కావడం తో సలార్ సినిమా పైన దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక టీజర్ విడుదల తేదీ విషయానికొస్తే సలార్ టీజర్ ను జులై 6 వ తేదీన తెల్లవారుజామున 5:12 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు హోంబలే పిక్చర్స్ తన ట్విట్టర్ ఖాతా లో ప్రకటించింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 28 న విడుదల చేస్తున్నారు.
𝐁𝐫𝐚𝐜𝐞 𝐲𝐨𝐮𝐫𝐬𝐞𝐥𝐟 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐦𝐨𝐬𝐭 𝐯𝐢𝐨𝐥𝐞𝐧𝐭 𝐦𝐚𝐧, #𝐒𝐀𝐋𝐀𝐀𝐑 🔥
Watch #SalaarTeaser on July 6th at 5:12 AM on https://t.co/QxtFZcNhrG #SalaarTeaserOnJuly6th#Prabhas #PrashanthNeel @PrithviOfficial @hombalefilms #VijayKiragandur @IamJagguBhai… pic.twitter.com/Vx1i5oPLFI
— Hombale Films (@hombalefilms) July 3, 2023