లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలపతి విజయ్, త్రిష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం LEO. కొన్ని రోజులు క్రితం వరకు LEO సినిమాలో రామ్ చరణ్ అతిధి పాత్రలో కనిపిస్తాడని గుసగుసలు వినిపించాయి. కాగా ఇప్పుడు ‘లియో సినిమాలో రామ్ చరణ్ పాత్ర లేదనే ‘వార్తలు వినిపిస్తున్నాయి.
రామ్ చరణ్ స్వయంగా లోకేష్, విజయ్‌లను లంచ్‌కి ఆహ్వానించారని, అందుకు ఇద్దరూ అంగీకరించారని చెబుతున్నారు. అయితే విజయ్ మరియు లోకేష్ చరణ్ ఇంటికి లంచ్ కి ఎప్పుడు వస్తారో ఇంకా తెలియదు కానీ రామ్ చరణ్ మాత్రం LEO లో నటించట్లేదని సమాచారం.
ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మిస్తుండగా , సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మిస్కిన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. LEO చిత్రం ఈ సంవత్సరం అక్టోబర్ 19 న తెలుగు తమిళ భాషల్లో భారీ విడుదలకు సిద్ధమైంది.
Follow Us On : YouTube , Google News