మహిళలకు బంగారం అంటే పిచ్చి. కాస్త డబ్బులు ఉన్నా వెంటనే బంగారం కొనుగోలు చేయాలని తపిస్తుంటారు. గతంలో సీజన్ కే పరిమితమైన బంగారం కొనుగోళ్లు నేడు సీజన్ తో నిమిత్తం లేకుండా అమ్మకాలు జరుగుతున్నాయి. అందుకే వీధికొక్క జ్యుయలరీ షాపు వెలిసింది. ఏ బంగారం దుకాణం చూసినా కిటకిట లాడిపోతుంటుంది. కరోనా సమయంలో బంగారం మధ్య తరగతి ప్రజలకు ఆసరాగా నిలిచింది. ఉద్యోగాలు కోల్పోయినా, ఉపాధి చిక్కకపోయినా బంగారం కుదువ పెట్టి ఒక నెల గడుపుకున్న రోజులను మహిళలు గుర్తు చేసుకుంటారు. అందుకే బంగారానికి అంత డిమాండ్. డిమాండ్ కు తగినట్లుగానే బంగారం ధరలు పెరిగిపోతుంటాయి.
గతంలో మాదిరి…
అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి మారకం విలువ తగ్గడం వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పు చోటు చేసుకుంటుందని నిపుణులు చెబుతుంటారు. గతంలో పెళ్లిళ్ల సీజన్ లోనూ, ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా బంగారం కొనుగోలు చేసే వారు. కానీ ఇప్పుడలా కాదు. ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకుంటున్నారు. బంగారాన్ని పెట్టుబడిగా చూడటం ప్రారంభమయ్యాక వాటి కొనుగోళ్లు కూడా పెరిగాయి. గతంలో మహిళలకే బంగారం అంటే మక్కువ అని చెప్పేవారు. కానీ ఇప్పుడు పురుషులు కూడా దానిని ఒక పెట్టుబడిగా చూడటంతో బంగారం కొనుగోళ్లు భారీగా పెరిగాయి.
రేట్లు ఇలా…
ఈరోజు దేశంలో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. ఆషాఢ మాసం కావడంతో ధరలు తగ్గాయని భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గుతుండటంతో మహిళలు హ్యాపీ ఫీలవుతున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈరోజు 54,150 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,060 రూపాయలు పలుకుతుంది. విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,300 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,22 రూపాయలుగా నమోదయింది. వెండి ధర మాత్రం తగ్గడం లేదు. కిలో వెండి ధర హైదరాబాద్, విజయవాడ మార్కెట్ లో ఈరోజు 75,800 రూపాయలుగా నమోదయింది.
Follow Us On : YouTube , Google News