ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సలార్ టీజర్ రానే వచ్చింది. కేజీఎఫ్ మూవీస్‌తో దేశం చూపును తనవైపు తిప్పుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఇది. గురువారం తెల్లవారుజామున మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా చిత్రలో ‘సలార్ ’ ఒక్కటి. ఇక అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ మూవీ టీజర్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానే వచ్చేసింది. బాహుబలి వంటి పాన్ ఇండియన్ హిట్స్ తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ దృష్టి అంతా సలార్ సినిమాపైనే ఉంది.
యశ్‌ను రాఖీ భాయ్ అనే పవర్ ఫుల్ రోల్ చూపించిన ప్రశాంత్ నీల్.. రెబల్ స్టార్ ప్రభాస్‌ను ఏ రేంజ్లో చూపిస్తాడో చూడాలని ఎంతోకాలంగా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక గురువారం ఉదయం 5:12 గంటలకు టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటి నుంచి అస్సలు ఆగలేకపోయారు. టైమ్ ఎప్పుడు అవుతుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. అన్న టైమ్‌కే టీజర్ రిలీజ్ చేస్తారా? ఆలస్యంగా విడుదల చేస్తే ఎలా అని కంగారు పడిపోయారు. కానీ చెప్పిన టైమ్‌కి సలార్ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
సినిమా ఎలా ఉండబోతోంది? ప్రభాస్ క్యారెక్టర్ ఎంతగా ఎలివేట్ చేశారు? అనేది ఒక్క డైలాగ్‌తో మేకర్స్ ఎస్టాబ్లిష్ చేశారు. సింహం, చిరుత, పులి, ఏనుగు చాలా ప్రమాదకరం.. కానీ జురాసిక్ పార్కులో కాదు..ఎందుకంటే అక్కడ ఉండేది.. అంటూ టినూ ఆనంద్ డైలాగ్‌తో మొదలైన టీజర్ అభిమానుల్లో అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ మూవీలో ప్రభాస్ మాస్ విశ్వరూపం కనిపించబోతోందని చెప్పకనే చెప్పేసింది. సలార్ టీజర్ చూస్తుంటే కేజీఎఫ్ ను మించిపోయేలా ప్రభాస్‌కు ఎలివేషన్ ఇచ్చినట్టు అర్థమవుతుంది.
సింహం, పులి, చిరుత, ఏనుగు ఇవన్నీ చాలా ప్రమాదకరమైన జంతువులే.. కానీ జురాసిక్ పార్కులో మాత్రం కాదు.. ఎందుకంటే అంటూ డైలాగ్ మధ్యలోనే ఆగిపోవడం.. ఆ తర్వాత పవర్ఫుల్ బీజీఎంతో ప్రభాస్‌ను చూపించడం గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ బ్యాక్‌గ్రౌండ్ లో మైనింగ్ ఏరియాలో ఉన్న విజువల్స్ చూస్తుంటే కేజీఎఫ్ సినిమాను మించిపోయేలా సలార్‌ను ప్లాన్ చేసినట్టు అర్థమవుతోంది. సలార్ తొలి భాగం సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28వ తేదీన విడుదల కానున్నట్లు ఈ టీజర్‌తోనే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.జీఎఫ్ మార్కు టేకింగ్ ఉన్న సీన్స్‌తో ప్రభాస్‌ను కనిపించీ కనిపించనట్టుగా క్షణకాలంలో ఇంట్రడ్యూస్ చేయడం మరో విశేషం.
నేటి తరం, ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఏం కోరుకుంటున్నారో అదే తెరపై చూపించేందుకు దర్శకుడు పక్కా ప్రణాళిక వేసుకున్నాడనేది టీజర్‌తోనే తెలిసిపోయిందనేది అభిమానులు చెప్పే మాట. టీజర్ చివరల్లో పృథ్వీరాజ్ ఇంట్రడక్షన్ కూడా అదుర్స్ అనేది పబ్లిక్ టాక్. ఈ టీజర్‌తో ప్రభాస్ అభిమానుల్లో ఉత్కంఠ పతాకస్థాయికి చేరుకోవడం పక్కా అనడంలో ఎటువంటి అతిశయోక్తీ ఉండదేమో. సలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహసన్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Follow Us On : YouTube , Google News