ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) కు పోటీగా మరో సామాజిక మాధ్యమ సంస్థ మెటా (Meta) కొత్త యాప్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ‘థ్రెడ్స్’ (Threads) పేరుతో తీసుకొచ్చిన టెక్ట్స్ ఆధారిత యాప్ నేటి నుంచి వినియోగదరులకు అందుబాటులోకి వచ్చింది.ఈ యాప్ ను ప్రారంభించిన తొలి రెండు గంటల్లోనే 20 లక్షల మంది ఇందులో ఖాతాలు తెరవగా.. తొలి నాలుగు గంటల్లో ఆ సంఖ్య 50 లక్షలకు పెరిగింది. ఈ విషయాన్ని మెటా సీఈవో జుకర్ బర్గ్ వెల్లడించారు. మెటా తీసుకొచ్చిన ఈ కొత్త ‘థ్రెడ్స్’ యాప్ ను ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను వినియోగించి లాగిన్ చేసుకోవచ్చు.
ఇందులో సుమారు వర్డ్స్‌తో లింక్స్, ఫొటోలు, ఐదు నిమిషాల నిడివిగల వీడియోలను సైతం పోస్ట్ చేసుకోవచ్చు.ఎన్నో లీక్‌ల తర్వాత ఎట్టకేలకు థ్రెడ్స్ యాప్ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఎలాన్ మస్క్‌కు చెందిన ట్విట్టర్‌కు పోటీ మెటా కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తీసుకువచ్చింది. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ యాప్‌ను ఆవిష్కరించారు. ఇన్స్టాగ్రామ్ బృందం స్వయంగా థ్రెడ్ యాప్‌ను అభివృద్ధి చేసింది. రియల్ టైమ్ ఫీడ్ థ్రెడ్‌లో అందుబాటులో ఉంటుంది. థ్రెడ్ ఫీచర్లు, ఇంటర్ ఫేస్ మొత్తం దాదాపు ట్విట్టర్‌ను పోలి ఉంటుంది. థ్రెడ్ భారత్‌లోను అందుబాటులోకి వచ్చింది.
గూగుల్ ప్లే స్టోర్ నుంచి థ్రెడ్స్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ టిక్ ఉంటే.. అంటే మీ ఇన్స్టాగ్రామ్ ఖాతా ఇప్పటికే ధ్రువీకరించబడి ఉంటే.. థ్రెడ్స్ యాప్‌లోనూ అకౌంట్ ఆటోమేటిక్‌గా ధ్రువీకరించబడుతుంది. యాప్‌ను యాపిల్ స్టోర్ నుంచి సైతం ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్రెడ్ యాప్‌లో Instagram IDతో లాగిన్ చేసుకోవచ్చు. మెటా ఇన్స్టాగ్రామ్ యాప్ ఫొటో షేరింగ్ మల్టీమీడియా ప్లాట్‌ఫారమ్. అయితే థ్రెడ్స్ ట్విట్టర్ మాదిరిగానే టెక్స్ట్ ఆధారిత సోషల్ మీడియా యాప్. ప్రస్తుతం ట్విట్టర్‌ను ఉపయోగిస్తున్న వారికి.. థ్రెడ్స్‌ను వాడడంలో ఎలాంటి సమస్యలుండవు.
ట్విట్టర్ పాత వెర్షన్ లాగా ఉంటుంది. థ్రెండ్స్లో వెబ్ లింక్‌లు, ఫొటోలు (ఒకేసారి గరిష్టంగా 10ఫొటోలు). నిమిషం వరకు వీడియోలను, 500 వరకు వర్డ్స్‌ను పోస్ట్ చేయవచ్చు. అలాగే ఎవరినైనా బ్లాక్ చేయడంతో పాటు ఫాలోకావొచ్చు. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరినైనా బ్లాక్ చేసి ఉంటే.. థ్రెండ్స్లో సైతం ఆ అకౌంట్స్ బ్లాక్ లిస్ట్‌లో ఉంటాయి. ఇదిలా ఉండగా.. యాప్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నది. ప్రారంభించిన 7 గంటల్లోనే కోటిమందికి పైగా యూజర్లు థ్రెడ్స్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు.
Follow Us On : YouTube , Google News