ఇటీవల కాలంలో ప్రేక్షకులు ఎటువంటి సినిమాలు ఆదరిస్తున్నారో.. ఎటువంటి సినిమాను రిజెక్ట్ చేస్తున్నారో అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తీసిన సినిమాలను కూడా అట్టర్ ఫ్లాప్ చేసేస్తున్నారు. ఎందుకిలా జరుగుతుంది అనేది సినిమా రంగంలో కనిపెట్టుకుంటే.. ఎక్కువ ఫ్లాక్స్ రాకుండా కాపాడుకోగలరు. ఒక సినిమా నష్టపోతే ఎన్ని కుటుంబాలు.. ఎంతమంది ( Samajavaragamana movie collection details ) జీవితాలు నష్టపోతాయి అనేది తెర వెనక చాలామందికి తెలియదు. భారీ బడ్జెట్ తోరిలీజ్ అయిన సినిమాలు డిజాస్టర్ గా మారుతున్నాయి. జూన్ 29వ తేదీ రిలీజ్ అయిన సామజవరగమన సినిమా శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ సినిమా మంచి హిట్ టాక్ ని తెచ్చుకుంది.
అసలు ఈ సినిమాపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇది ఒక సినిమా ఉందని.. ఈ సినిమా వస్తుందని కూడా చాలామందికి తెలియదు. కానీ ఒకరి తర్వాత ఒకరికి మౌత్ కాన్వాసింగ్ బాగా జరిగి సినిమా చాలా బాగుంది అని పేరు తెచ్చుకుంది. సెలబ్రిటీస్ ( Samajavaragamana movie collection details ) కూడా ఈ సినిమాని పొగుడుతూ చెప్పడం జరిగింది. చాలాకాలం తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుకునే సినిమా వచ్చిందని ఆనందంగా చెప్పారు. ఇలా సామజవరగమన సినిమా తెలుగు ఆడియన్స్ కూ ఎంతగానో నచ్చింది. ఈ సినిమాలో కామెడీ చాలా బాగుంది. ఇందులో ప్రతీ నటుడు కూడా చాలా బాగా నటించాడు. శ్రీ విష్ణు అయితే తన పాత్రలో తాను చక్కగా ఇమిడిపోయాడు.రిలీజ్ అయిన వారం రోజులకే ఈ సినిమా 30 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుంది .
చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుని రికార్డు కలెక్షన్స్ రాబడుతుంది ఇక చాలా రోజుల తర్వాత శ్రీ విష్ణు భారీ హిట్ ను అందుకున్నాడు ఈ నేపథ్యంలోనే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు. తమ సినిమాను ఇంతగా ఆదరించినందుకు చిత్ర బృందం ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది కథ బావుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపించారని తెలిపింది. ఇక ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో శ్రీ విష్ణు మాట్లాడుతూ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాకుండా చిరంజీవి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. సామజవరగమన ట్రైలర్ ను చిరు చేతుల మీదనే రిలీజ్ చేయించిన విషయం తెలిసిందే. అది మా సినిమాకు బాగా కలసి వచ్చిందని శ్రీ విష్ణు తెలిపాడు.
“సామజవరగమన ట్రైలర్ లాంచ్ చేసేటప్పుడు మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi) చేయి నా గుండె మీద తాకింది. ఆ ఆటోగ్రాఫ్ నా గుండెపై ఎప్పుడైతే పడిందో అప్పటి నుంచే మా అందరి జాతకం మారిపోయింది. రామ్ అబ్బరాజు నాకు ఈ కథ చెప్పినప్పుడే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అనిపించింది. అందుకే ఈ సినిమాపై మా టీమ్ అంతా చాలా నమ్మకంగా ఉన్నాము. ఇక చిరంజీవి గారు ట్రైలర్ రిలీజ్ చేశాక సినిమాకు మంచి బజ్ వచ్చింది. ఈ సినిమాను అందరూ నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో పోల్చుతుంటే.. చాలా సంతోషంగా ఉంది” అని శ్రీ విష్ణు తెలిపాడు మరి ముందు ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
Follow Us On : YouTube , Google News