బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో? ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేం. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులను బట్టి బంగారం ధరల్లో హెచ్చు తగ్గులుంటాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ, ద్రవ్యోల్బణం వంటివి కూడా గోల్డ్ రేట్స్ పై ప్రభావం చూపుతాయి. అందుకే బంగారం ధరల పెరుగుదల, తగ్గుదల ఎవరి చేతిలోనూ ఉండదు. కొనుగోళ్లు తగ్గినా బంగారం ధరలు మాత్రం తగ్గవు. ఆషాఢ మాసం కావడంతో ధరలు తగ్గుతాయని భావించిన మదుపరులకు నిరాశ ఎదురయింది.
ధరలు ఎలా ఉన్నాయంటే…
ఈరోజు బంగారం ధరలు దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం పై వంద రూపాయలు పెరిగింది. వెండి మాత్రం భారీగానే పెరిగింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారు కొంత షాక్ కు గురయ్యారు. వెండి ధరలు కూడా భారీగా పెరగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 54,250 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరలు 59,160 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర ఎనిమిది వందల రూపాయలు పెరిగి ప్రస్తుతం మార్కెట్ లో 73,000 రూపాయలు పలుకుతుంది.
Follow Us On : YouTube , Google News