చిత్రం: రంగబలి (Rangabali)
రేటింగ్: 2.5/5
నటీనటులు: నాగశౌర్య, యుక్తి తరేజా, గోపరాజు రమణ, సత్య తదితరులు
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
కెమెరా: వంశీ పచ్చిపులుసు, దివాకర్ మణి
మ్యూజిక్: పవన్ సీహెచ్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం: పవన్ బాసంశెట్టి
విడుదల తేదీ: జులై 7, 2023
కథ:
సొంతూరు రాజవరంలో కింగులా బతకాలని అనుకుంటాడు శౌర్య అలియాస్ షో (నాగ శౌర్య). ఏ పని చేసినా పది మంది తన వైపు చూడాలని షో చేస్తూ ఉండటంతో షో అనే పేరు వస్తుంది. ఇక శౌర్యకు ఆ ఊర్లోని రంగబలి సెంటర్‌కు వెళ్లినప్పుడల్లా కింద పడే అలవాటు ఉంటుంది. శౌర్యకు ఆ ఊరి ఎమ్మెల్యే పరుశురామ్ (షైన్ టామ్ చాకో)తో మంచి రిలేషన్ ఉంటుంది. మరోవైపు, శౌర్య తండ్రి విశ్వం (గోపరాజు రమణ) మెడికల్ షాపును నడిపిస్తూ ఊర్లో గౌరవంగా బతుకుతుంటాడు. శౌర్యకు ఆ మెడికల్ షాపు బాధ్యతలు అప్పగించే క్రమంలో ఓ సారి వైజాగ్‌కు పంపిస్తాడు. అక్కడి మెడికల్ కాలేజ్‌లో సహజ (యుక్తి)తో పరిచయం ఏర్పడుతుంది. అయితే, తన ప్రేమకు రంగబలి సెంటర్ ఎలా అడ్డంకిగా మారింది? అసలు ఆ సెంటర్‌కు రంగబలి (Rangabali) అని పేరు ఎందుకు వచ్చింది? రంగబలి సెంటర్‌కు ఆ ఎమ్మెల్యేకు ఉన్న రిలేషన్ ఏంటి? రంగబలితో శౌర్యకు ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అన్నది అసలు సినిమా.
కథనం:
కడుపులు చెక్కలైపోయే కామెడీ.. కరిగిపోయే ఎమోషన్.. ఈ రెండు ఒకే సినిమాలో పర్ఫెక్ట్ గా మిక్స్ అవ్వడం అరుదు. బలవంతంగా కలపాలని చూస్తే రంగబలిలా తయారవుతుంది. ఈ సినిమా బాగోలేదని చెప్పలేము.. అలాగని భలే తీసాడురా అని పొగడలేము. ఫస్టాఫ్ వరకు రేసుగుర్రంలా పరిగెట్టింది సినిమా.. ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా నాన్ స్టాప్ గా నవ్వించాడు దర్శకుడు పవన్ భాసంశెట్టి. ముఖ్యంగా సత్య కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్.. జస్ట్ అలా ఒంటి చేత్తో సినిమాను నడిపించాడు. ఇంటర్వెల్ వరకు సినిమా చూశాక.. బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోతారు. ఛలో తర్వాత ఆ రేంజ్ సినిమా పడింది నాగశౌర్యకు అనుకుంటారు. కానీ అసలు డ్రా బ్యాక్ సెకండ్ హాఫ్ లో మొదలైంది. అప్పటివరకు ఎంటర్టైనింగ్ గా సాగిన కథ ఒక్కసారిగా సీరియస్ టర్న్ తీసుకుంది.. మెయిన్ స్టోరీ వచ్చేసరికి.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రొటీన్ ఫ్లాష్ బ్యాక్ సెకండ్ హాఫ్ ను భారీగా దెబ్బ తీసింది. క్లైమాక్స్ 20 నిమిషాలు కామెడీగా ప్రయత్నించాడు కానీ.. అదేదో హడావిడిగా ముగించినట్టే అనిపించింది. ఫస్టాఫ్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్.. సెకండ్ హాఫ్ లో కనీసం సగం ఉన్నా రంగబలి బ్లాక్ బస్టర్ అయ్యేది. కానీ సగం దూరం వచ్చి పెట్రోల్ అయిపోయిన బండిలా ఆగిపోయింది.
టెక్నీషియన్స్ :
దర్శకుడు పవన్ బాసింశెట్టి ‘రంగబలి’ సినిమ ా కథను ‘ఛలో’ సినిమాను ప్రేరణగా తీసుకొని దాన్ని ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేసాడు. ఫస్టాఫ్ మొత్తంగా హీరో (నాగశౌర్య) క్యారెక్టరైజేషన్, ఎలివేషన్ సీన్స్‌తో పాటు సత్య కామెడీని నమ్ముకున్నాడు. మధ్య హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ సీన్స్‌తో మంచిగానే లాక్కొచ్చాడు. అటు తండ్రీ కొడుకుల మధ్య ఉండే అనుబంధం.. చెడు తిరిగుళ్లు తిరిగే కొడుకుపై కోప్పడే తండ్రి పాత్ర అంతా బాగానే ఉంది. ముఖ్యంగా సత్య క్యారెక్టర్‌ను ఇతరులు సంతోషంగా ఉండే ఓర్వలేని తనం కామన్‌గా మనలో చాల ా మందికి ఉంటుంది. అది కనెక్ట్ అయ్యేలా ఈ పాత్రను డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంది. అటు మెడికల్ కాలేజీలో సత్యతో ఇతర పాత్రలతో చేయించిన కామెడీ వరకు అంతా బాగానే అనిపించినా.. ఇంటర్వెల్ వరకు కథ సరైన గాడిన పడదు. ఇంటర్వెల్ తర్వాత రంగబలి సెంటర్‌కు ఆ పేరు ఎలా వచ్చింది. దానికి హీరోకు ఉన్న సంబంధాన్ని సెకండాఫ్‌లో చెప్పినా.. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో విఫలమయ్యాడు. ఈ సినిమాకు పనిచేసిన ఇతర టెక్నికల్ టీమ్ విషయానికొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. పవన్ ఆర్ఆర్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటర్ తన కత్తెరకు పదను పెడితే బాగుండేది. పవన్ సిహెచ్ సంగీతం పర్లేదు. నేపథ్య సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ వర్క్ పర్లేదు. ఎడిటింగ్ సెకండ్ హాఫ్‌లో కాస్త ట్రిమ్ చేసి ఉండాల్సిందే. దర్శకుడు పవన్ కథ చెప్పనంతవరకు ఇరగ్గొట్టాడు.. కథ చెప్పడం మొదలుపెట్టాక వెనకబడ్డాడు.. అయినా కూడా కామెడీ కోసం ఓసారి ట్రై చేయొచ్చు ఈ సినిమా.
ప్లస్:
+ నాగ శౌర్య నటన
+ సత్య కామెడీ
మైనస్:
– అంతగా ఆకట్టుకొని కథనం
– పేలవంగా పతాక సన్నివేశాల చిత్రీకరణ
– వీక్ క్లైమాక్స్
విశ్లేషణ:
నాగశౌర్య ఓ మధ్య తరగతి యువకుడి పాత్రలో ఎంతో ఈజ్‌తో నటించాడు. ముఖ్యంగా తండ్రీ, కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో అతని నటన ఆకట్టుకుంది. హీరోయిన్ యుక్తి తరేజా.. చూసేందకు పద్ధతిగా కనిపించినా.. పాటల్లో మాత్రం ఓ రేంజ్లో రెచ్చిపోయింది. పాటల్లో లిప్‌లాక్ వంటి సన్నివేశాల్లో ఎలాంటి మొహమాటం లేకుండా నటించింది. దసరా తర్వాత షైన్ టామ్ చాకో ఈ సినిమాలో విలన్‌గా స్టైలిష్‌గా కనిపించాడు. సత్య ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. సినిమాను తన కామెడీతో నిలబెట్టాడనే చెప్పాలి. ఇక చివర్లో సప్తగిరి.. అతిగా చేసే జర్నలిస్ట్ పాత్రలో నవ్వించాడు. ఇక మురళీ శర్మ.. అతిథి పాత్రలో నటించిన శరత్ కుమార్, శుభలేక సుధాకర్ తమ పరిధి మేరకు మెప్పించారు. ఎడిటర్.. ఇంటర్వెల్‌కు ముందు.. సెకండాఫ్‌లో తన కత్తెరకు మరింత పదును పెడితే బాగుండేది.
అయితే మాస్ ఇమేజ్ కోసం పరితపిస్తూ కమర్షియల్ చిత్రాలను ఎంచుకుంటూ వస్తున్నారాయన. మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేందుకు నాగ శౌర్య చేస్తోన్న సినిమాలు అంతగా కలిసి రావడం లేదు. ‘ఛలో’ తరువాత ఆ రేంజ్ హిట్ కొట్టేందుకు సతమతం అవుతున్నారు. సొంత బ్యానర్లో చేసిన సినిమాలు సైతం బోల్తా కొట్టాయి. ఇప్పుడు ‘దసరా’ నిర్మాతతో కలిసి ‘రంగబలి’ అంటూ మరోసారి అవుట్ అండ్ అవుట్ కామెడీ, కమర్షియల్ సినిమాతో వచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో ‘రంగబలి’ మూవీ చేసాడు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్టు అందుకుంటాడా..?
రేటింగ్: 2.5/5