శ్రీవిష్ణు హీరోగా నటించిన సామజవరగమన (Samajavaragamana) సినిమా టాలీవుడ్లో పెద్ద విజయం సాధించింది. రెండవ వారాంతంలో కూడా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొంటోంది. రామ్ అబ్బరాజు నిర్మించిన ఈ ఫ్యామిలీ ఓరియెంటెడ్ కామెడీ చిత్రంలో రెబా మోనికా జాన్ (Reba Monica John) కథానాయికగా నటించింది. ఈమెకు తెలుగులో ఇదే మొదటి చిత్రం కావడం విశేషం.
ఈ చిత్రం ఇండియా లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా పెద్ద విజయాన్నే అందుకుంది. అమెరికన్ బాక్సాఫీస్ వద్ద సామజవరాగమన (Samajavaragamana) చిత్రం తన డ్రీం రన్ ను కొనసాగిస్తూ ఉంది. ఈ సినిమాను యునైటెడ్ స్టేట్స్ లోని అక్కడి డిస్ట్రిబ్యూటర్ కేవలం 25 లక్షల రూపాయల తో (Indian Currency) అమెరికా రైట్స్ కొనగా, ఇప్పటికే సుమారుగా 800,000 లక్షల డాలర్లు లేదా భారతీయ రూపాయలలో 6.6 కోట్లు వసూలు చేసింది.
యునైటెడ్ స్టేట్స్లో $1 మిలియన్ డాలర్ల అడ్డంకిని సామజవరగమన చిత్రం ఛేదించగలదా అనేది ఇప్పుడు కీలక ప్రశ్న. దానికి సమాధానం తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. ఈ చిత్రంలో నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘు బాబు, రాజీవ్ కనకాల, మరియు దేవి ప్రసాద్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రాజేష్ దండా దర్శకత్వం వహించారు.