తెలంగాణలో నేడు విద్యాసంస్థల బంద్ ను పాటించనున్నారు. లెఫ్ట్ పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాలు ఈ బంద్ కు పిలుపు నిచ్చాయి. విద్యారంగంలో నెలకొన్న సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయంటూ ఈ బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపు నిచ్చాయి. పాఠశాలలు, కళాశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరాయి. రాష్ట్రంలో ప్రయివేటు విద్యాసంస్థల్లో అధిక ఫీజు వసూలు చేస్తున్నా విద్యాశాఖ పట్టించుకోవడం లేదన్న కారణంతో ఈ బంద్ చేయాలని నిర్ణయించాయి.
బడ్జెట్ లో నిదులు….
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలతో పాటు కళాశాలలు కూడా బంద్ పాటించాలని పిలుపు నిచ్చాయి. ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, బడ్జెట్ విద్యకు సరిపడా నిధులను కేటాయించడం లేదని ఆరోపిస్తూ నేడు బంద్ పాటిస్తున్నారు. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐలు సంయుక్తంగా ఈ బంద్ కు పిలుపు నిచ్చాయి. కార్పొరేట్ స్కూళ్లకు కొమ్ముకాస్తున్న అధికారులపై సత్వరం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.