తెలంగాణలో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా నేటి నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
భారీ వర్షాలు…
హైదరాబాద్ నగరంలోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే ఛాన్సు ఉందని తెలిపింది. తెలంగాణలోని కొమురం భీం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముంది.