ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. మోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళుతున్న ముందు జరగనున్న ఈ భేటీకి ప్రాధాన్యత ఉంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలపై కూడా మంత్రివర్గ సమావేశం చర్చించనుంది. దీంతో పాటు మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది.
వివిధ అంశాలపై…
పార్లమెంటు వర్షా కాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విపక్షాల విమర్శల దాడిని ఎలా ఎదుర్కొనాలన్న దానిపైన కూడా సమావేశంలో చర్చించనున్నారు. కేబినెట్ విస్తరణపై ఇప్పటికే కసరత్తు దాదాపుగా పూర్తయిందంటున్నారు. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలకు కేబినెట్ లో చోటు కల్పించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి కొందరు కేంద్ర మంత్రులను కేబినెట్ నుంచి తప్పించి వారికి పార్టీ బాద్యతను అప్పగించనున్నారు. శాఖల విషయంలోనూ నేటి సమావేశంలో చర్చజరగనుంది.