మనకందరికీ వాటర్ మెలోన్ తెలుసు,మస్క్ మెలోన్ తెలుసు కానీ లెమన్ మెలోన్ ఎప్పుడైనా విన్నారా . వాటర్ మిలన్ తియ్యగా ఉంటుందని, లెమన్ పుల్లగా ఉంటుందని మనకు తెలుసు. కానీ ఈ రెండు రుచులు కలగలిపిన సరికొత్త టేస్ట్ ఎలా ఉంటుంది చెప్పండి ? అది తెలుసుకుందాం అనే జపాన్ హార్టికల్చర్ రైతుల ‘లెమన్ మిలన్’ ని సృటించారు . తీపి, పులుపు కలగలసిన సమ్మేళనాలతో అమోఘమైన రుచితో ఆకట్టుకుంటున్న ఈ ఫలాన్ని జపాన్ కు చెందిన సంటరీ ఫ్లవర్స్ అనే హార్టికల్చర్ కంపెనీకి చెందిన నిపుణులు డెవలప్ చేశారు. ఈ ఫలాన్ని ని డెవలప్ చెయ్యడానికి వారికి ఐదేళ్ల సమయం పట్టింది.
వాస్తవానికి విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఒక రకమైన పుచ్చకాయ నుంచి లెమెన్ మిలనన్ను సృష్టించే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు, ఉద్యానవన నిపుణులు సాగు పద్ధతులు, పంట సమయాలతో సహా అనేక అంశాలతో విస్తృతంగా ప్రయోగాలు చేశారు. ఈ క్రమంలో అనేక ఆటంకాలు కూడా ఎదురయ్యాయని చెప్తున్నారు. అందుకే తాము ఊహించిన సరైన ఉత్పత్తి ఫలం రావడానికి ఐదేళ్లు పట్టిందని చెప్తున్నారు. తుది ఉత్పత్తి స్పష్టంగా అసలైన నిమ్మకాయలతో మిళితం చేయబడిందని, ఇది పుచ్చకాయలాగా జ్యూసీ అండ్ స్వీటీగా ఉంటుందని తెలిపారు.
కొత్తగా క్రియేట్ చేసిన లెమన్ మిలన్ సాధారణంగా గుండ్రని ఆకారాన్ని కలిగి ఉంటుంది. కానీ దాని పైతొక్కలో పుచ్చకాయ లక్షణాలు కలిగిన చారలు, స్ట్రైయేషన్ ఉండవు. తెల్లటి ఫ్లెష్ లాంటి పదార్థాన్ని కలిగి ఉంటుంది. దీని ఆకృతిని బెర్రీతో పోల్చవచ్చు. ప్రస్తుతం హక్కెడోలో కేవలం ఐదుగురు రైతులు మాత్రమే ఈ లెమన్ మెలోన్ ను పండిస్తున్నారట . ఈ ఏడాది దాదాపు 3,800 లెమన్ మిలన్స్ ను ఉత్పత్తి చేస్తామన్నారు . ముఖ్యమైన విషయం ఏంటంటే.. పులుపు, తీసి సమ్మేళనాల రుచులు కలిగిన ఈ లెమన్ మిలన్ టేస్టీగా ఉంటుందని చాలామంది ఇష్టపడుతున్నారని వారు తెలిపారు .