బోయపాటి శ్రీను దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంట్ హీరో రామ్ పోతినేని బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘స్కంద’ మూవీ ని పూర్తి చేశాడు. ఈ సినిమా కోసం పొడుగు జుట్టు, గడ్డంలో మాస్ లుక్ లో కనిపించబోతున్నారు ఆయన.ఆ తర్వాత పూరీ జగన్నాధ్ ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం లుక్ మార్చేశాడు. తాజాగా ఇస్మార్ట్ శంకర్ బ్యాక్ అంటూ హెయిర్ కట్ చేసుకుంటున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు
ఇక ‘స్కంద’ చిత్రంలో కాస్త బొద్దుగా కనిపించిన రామ్.. ఇందులో మాత్రం నార్మల్ గానే కనిపించాడు. స్లిమ్లా, పాష్గా కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. దీంతో చాలా కొద్ది రోజుల వ్యవధిలో రామ్ మారిన విధానం చూసి అతని ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు . రేపటి నుంచి ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ సెట్స్ పైకి రాబోతోంది. కాగా పూరీ జగన్నాధ్, చార్మీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. మొదటి షెడ్యూల్ హైదరాబాద్లో ప్లాన్ చేశారు. హీరోయిన్ ఎవరనేది త్వరలోనే వెల్లడించనున్నారు. అయితే ప్రస్తుతానికి మీనాక్షీ చౌదరిని తీసుకుంటున్నట్లు వినికిడి .
A transformation that will transport you to the world of #DoubleISMART 🤙
Ustaad @ramsayz is back to Banger Avatar as #IsmartShankar to give you all DOUBLE IMPACT🔥
Madness begins on the sets TOMORROW❤️🔥
In cinemas on MARCH 8th, 2024💥#RAmPOthineni… pic.twitter.com/eFwMkCalvO— Puri Connects (@PuriConnects) July 11, 2023