ప్రస్తుతం చాలా మంది షుగర్ వ్యాధి తో బాధపడుతున్నారు. మన ఆహారపు అలవాట్లు జీవన సైలి ఈ సమస్యకు కారణం అవుతోంది . ఇక డయాబెటిస్ ఉన్నవారు ఆరోగ్య పరం గా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే కొంత మంది మందులు వాడినప్పటికీ డయాబెటిస్ అదుపులో లేకుండా పోతుంది. కానీ అల్లంతో డయాబెటిస్ కు కాస్త చెక్ పెట్టవచ్చ అంటున్నారు నిపుణులు .
అది ఎలా అంటే అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక షుగర్ ఉన్నవారు అల్లం తినడం ఆరోగ్యానికి మరీ మంచిదంటున్నారు .రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు అల్లాన్ని వాడడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతున్నాయని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారిపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైదని స్పష్టం చేసారు . టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారికి రోజూ 4 గ్రాముల అల్లాన్ని ఇచ్చి చూడడం వల్ల వారిలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతున్నాయని వారు వెల్లడించారు.
అలాగే అల్లాన్ని వాడడం వల్ల రక్తపోటు కూడా తగ్గుతుందని ఈ పరిశోధనల్లో వెల్లడైదని తెలిపారు . దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కాబ్బటి దీనిని ఔషదాల తయారీలలో కూడా విరివిరిగా ఉపయోగిస్తారన్నారు . అల్లాన్ని వాడడం వల్ల రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండడంతో పాటు మనం అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు అని నిపుణులు తెలిపారు