పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెంచే విధంగా చిత్ర యూనిట్ సభ్యులు విభిన్నమైన తరహాలో ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ బాగానే అట్రాక్ట్ చేసింది. ఇక థమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ హడావిడి పెంచేస్తున్నారు.
బ్రో సినిమాకు సంబంధించిన మరొక వినూత్నమైన ప్రమోషన్ చేసిన పింపుల్ మీడియా ఫ్యాక్టరీ అందరినీ బాగానే అట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఈ తరహా ప్రమోషన్స్ కు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గోదావరి నదిలో బోట్లను ఒక ఆకారంలో చేసే బ్రో అనే టైటిల్ ను హైలెట్ చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ పోస్టర్స్ కూడా నదిలో చూపించారు.
ఇక డ్రోన్లతో చూపించిన కొన్ని షాట్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా ఈ బోట్స్ షోను చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రెగ్యులర్ గా కాకుండా కాస్త భిన్నంగా ట్రై చేసిన ప్రమోషన్స్ బాగానే వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాను జూలై 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్న విషయం తెలిసింది.
తమిళంలో సక్సెస్ అయిన వినోదాయ సీతం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్టుగా తెరకెక్కించారు. సినిమాకు సంబంధించిన ట్రైలర్ కోసం కూడా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మాటలు అందించారు.
ట్రైలర్ ను వచ్చే వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ కేతిక శర్మ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఇక ముఖ్యమైన పాత్రలో సుబ్బరాజు రోహిణి తనికెళ్ల భరణి నటిస్తుండగా ఒక ప్రత్యేకమైన పాత్రలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా కనిపించబోతున్నారు. ఇక బ్రో సినిమా అయితే బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 100 కోట్లకు పైగానే థియేట్రికల్ బిజినెస్ చేయనున్నట్లు సమాచారం.
Brace yourselves for the #BroTheAvatar Mania as we GEAR UP to storm your timelines 🥳
Here's BRO boats charging into the Waters of Godavari ⛵💥
More updates your way.@PawanKalyan @IamSaiDharamTej @UrvashiRautela @TheKetikaSharma @thondankani @MusicThaman @vishwaprasadtg… pic.twitter.com/Ru5od0kajd
— People Media Factory (@peoplemediafcy) July 11, 2023