ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికార పార్టీకి ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. తమ పదవులకు రాజీనామాలు చేసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే వాటిని ఎదుర్కొని మరో సమర్థవంతమైన నాయకుడిని ఎంపిక చేయడం మినహా అధికార పార్టీకి మరో దారి లేదు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా గట్టి దెబ్బే తగులనుంది. రానున్న రోజుల్లో మరికొందరు రాజీనామా బట్టే అవకాశాలున్నాయి.
జిల్లా అధ్యక్ష పదవికి…
తాజాగా విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను హైకమాండ్ కు పంపారు. తాను అధిష్టానం దృష్టికి ఎన్నో సమస్యలను తీసుకెళ్లాలని ప్రయత్నించినా వీలు కాలేదని తెలిపారు. తాను కార్యకర్తల సమస్యలను తీర్చలేనప్పుడు ఈ పదవిలో ఉండటం వృధాగా భావించి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తనకు, పార్టీ ఇన్ ఛార్జి వైవీ సుబ్బారెడ్డికి మధ్య ఎలాంటి విభేదాలు లేవని పంచకర్ల రమేష్ బాబు తెలిపారు.