గోల్డ్ అంటే చాలు పడతులు పడి చచ్చిపోతారు. ఎంత బంగారం ఉంటే అంత గౌరవంగా భావిస్తారు. సమాజంలో స్థానం కోసం బంగారం ఒక ఆభరణంగా మారింది. ఎంత బంగారం ఉంటే అంత సంపన్నులని అర్థం వచ్చే నేటి రోజుల్లో బంగారాన్ని సందర్భం లేకుండా కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు మాత్రమే బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరిగేవి. కానీ పెట్టుబడులుగా చూడటం ప్రారంభం కావడంతో బంగారం కొనుగోళ్లు ఎక్కువయ్యాయి.
కష్టకాలంలో…
బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. తగ్గడం అనేది తక్కువ సార్లు. పెరుగుతున్న ధరలను చూసి ఎవరూ వెనుకంజ వేయడం లేదు. బంగారం మన వద్ద ఉంటే ఆర్థిక సమస్యలు తలెత్తినప్పుడు చేదోడుగా ఉండే వస్తువు కావడంతో బంగారం కొనుగోలుకు పేద, ధనిక తేడా లేకుండా కొనుగోలు చేస్తుంటారు. బ్యాంకుల్లో కుదవపెట్టినా తక్కువ వడ్డీ కావడం కూడా బంగారం కొనుగోళ్లకు ఒక కారణంగా చెప్పాలి. అంతేకాకుండా పిల్లల చదువుకు కూడా పసిడి తోడ్పడుతుందన్న భావన పెరిగింది.
వెండి ధరలు…
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 54,650 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం 59,620 రూపాయలుగా కొనసాగుతుంది. వెండి ధర మాత్రంపెరిగింది. కిలో వెండి ధర 73,600 రూపాయలుగా నమోదయింది. విశాఖపట్నం, విజయవాడ బులియన్ మార్కెట్ లొనూ అదే ధరలు కొనసాగుతున్నాయి.