సమంతా మరియు విజయ్ దేవరకొండ కీలక పాత్రల్లో నటించిన ‘కుషి’ చిత్రంలోని రెండవ పాట “ఆరాధ్య” యొక్క లిరికల్ వీడియో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో విడుదల చేసారు. ఈ పాట లోని ఒక షాట్ ఇప్పుడు సమంత కు (Samantha Ruth Prabhu) తలనొప్పి తెచ్చి పెట్టింది. దాదాపుగా 10 సంవత్సరాల క్రితం నాటి సమంత చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.
అసలు కథ..!
మహేష్ బాబు – కృతి సనాన్ జంటగా సుకుమార్ దర్శకుడిగా తెరకెక్కిన “1 నేనొక్కడినే” సినిమా విడుదల అయ్యి దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది. ఆ సినిమా రిలీజ్ టైం లో చిత్ర యూనిట్ ఒక పాటకి సంబంధించి ఒక పోస్టర్ ని విడుదల చేసారు. ఆ పోస్టర్ లో గోవా బీచ్ లో మహేష్ బాబు కాళ్ళను కృతి సనన్ తాకుతూ ఉన్నటు ఉంటుంది. ఆ పోస్టర్ని తీవ్రంగా విమర్శిస్తూ అప్పట్లో తన ట్విట్టర్ ఖాతా ద్వారా సమంత (Samantha) ట్వీట్ చేసింది. అప్పటి నుండే సమంత పై మహేష్ బాబు ఫాన్స్ కోపంగా ఉన్నారు.
Saw a poster of a yet to be released Telugu film.Not only is it deeply regressive,but it's point is actually that it is deeply regressive
— Samantha (@Samanthaprabhu2) December 16, 2013
పగ సాధించిన మహేష్ ఫాన్స్..!
ప్రస్తుతం సమంత – విజయ్ దేవరకొండ “ఖుషి” సినిమా సాంగ్ లో విజయ్ కాళ్ళను సమంత పట్టుకున్నట్టు ఉండడంతో సమంత పై నెటిజెన్ లు తీవ్ర స్థాయిలో ట్రోల్ల్స్ చేస్తున్నారు. “కర్మ హిట్స్ యు బ్యాక్” అనే హ్యాష్ టాగ్ తో సమంతను విమర్శిస్తూ మహేష్ ఫాన్స్ ట్విట్టర్ లో ట్రెండ్స్ చేస్తున్నారు. ఈ సినిమా ను సెప్టెంబర్ “1” న విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు దర్శకునిగా నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీశ్ సినిమాలకు దర్శకత్వం వహించిన శివ నిర్వాణ వ్యవహరిస్తున్నారు.
No Hate But Sorry #Samantha
Karma Hits Back 🍌 pic.twitter.com/eTKTk3NQo8— Nikhil_Prince🚲 (@Nikhil_Prince01) July 12, 2023