చంద్రయాన్ – 3 ప్రయోగం మరికాసేపట్లో జరగనుంది. శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్ – 3 మధ్యాహ్నం 2.35 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. జాబిల్లి మీద ఈ చంద్రయాన్ – 3 దిగనుంది. ఈ ప్రయోగం కోసం ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఇస్రో శాస్త్రవేత్తలు శ్రమించి రూపొందించిన చంద్రయాన్ – 3 విజయవంతమైతే ప్రపంచంలోనే చంద్రుడి మీదకు పంపిన నాలుగో దేశంగా భారత్ రికార్డులకు ఎక్కనుంది.
చంద్రుడి పుట్టుకకు…
ఈ ప్రయోగంతో చంద్రుడి పుట్టుకకు సంబంధించి అనేక విషయాలు వెలుగు చూసే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడి మీద గతంలో సోవియట్ యూనియన్, అమెరికా, చైనాలు తమ ర్యాకెట్లను పంపాయి. వాటి సరసన భారత్ నేడు చేరనుంది. చంద్రయాన్ – 2 విఫలం కావడంతో దీని విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. సాఫ్ట్ ల్యాండింగ్ అయితే ప్రయోగం దాదాపు విజయవంతమయినట్లే. చంద్రయాన్ – 3 ప్రయోగం విజయవంతం కావాలని యావత్ భారత్ దేశం ఆకాంక్షిస్తుంది. ప్రార్ధిస్తుంది.