కామన్ సివిల్ కోడ్ పై హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. ఈ చట్టం తెచ్చి హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ చట్టాన్ని రద్దు చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం అసదుద్దీన్ ఒవైసీ మీడియాతో మాట్లాడారు. జాతీయ సమైక్యత, భిన్నత్వం గురించి తరచూ మాట్లాడే ప్రధాని మోదీ కామన్ సివిల్ కోడ్ తెచ్చి వాటికి భంగం కలిగిస్తారా? అని ప్రశ్నించారు.
ఉమ్మడి పౌరస్మృతిపై…
అలాగే పంజాబ్ వెళ్లి సిక్కులకు ఉమ్మడి పౌరస్మృతి గురించి చెప్పాలన్న అసదుద్దీన్ ఒవైసీ ఆ తర్వాత అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలని మోదీని కోరారు. ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకించాలని అన్ని పార్టీలను కలసి మద్దతు కోరతామన్నారు. దేశ సమగ్రతను కాపాడేందుకు తమతో మిగిలిన పార్టీలు కలసి రావాలన్న అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మతం చిచ్చు రేపి లబ్దిపొందాలన్నదే బీజేపీ ప్రయత్నం అని అసదుద్దీన్ ఫైర్ అయ్యారు.