బెంగళూరు: దేశీయ దిగ్గజం ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్(Flipkart) తన బిగ్ సేవింగ్ డేస్ సేల్(Big Savings Day Sale) తేదీలను ప్రకటించింది. మరో దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ ఇండియా ఇటీవల తన ప్రైమ్ డే సేల్ ను 15, 16వ తేదీల్లో నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది . ఈ క్రమంలోనే ఫ్లిప్కార్ట్ సైతం అమెజాన్ కు పోటీగా బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను ఈ నెల 15-19వ తేదీల మధ్య ఆరు రోజులు నిర్వహించనున్నట్టు తెలిపింది.ఈ సేల్లో వివిధ బ్రాండ్ల స్మార్ట్ఫోన్లు, ఫర్నీచర్, ల్యాప్టాప్లు సహా అనేక రకాల ఉత్పత్తులపై 80 శాతం వరకు డిస్కౌంట్ ఉందని,అంతేకాకుండా టీవీలు, ఇతర గృహోపకరణాలపై 75 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ ఉన్నట్టు ఆ సంస్థ వెల్లడించింది.
ఇవె కాకుండా ఫ్యాషన్, ఇతర వస్తువులపై రాయితీలు ఇవ్వనున్నట్టు పేర్కొంది. ప్రత్యేక సేల్ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డు ఉన్న వినియోగదారులకు డిస్కౌంట్స్ ఏ కాకుండా అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుందని, ఫ్లిప్కార్ట్ ప్లస్ సబ్ స్కైబర్లకు ఒకరోజు ముందు సేల్ ప్రారంభమవుతుందని కంపెనీ వివరించింది.వెబ్సైట్లో ఉన్న వివరాల ప్రకారం, ఈ సేల్లో ఫ్లిప్కార్ట్ ఐఫోన్ 13, ఐఫోన్ 14 స్మార్ట్ఫోన్లపై మెరుగైన ఆఫర్లు అందించనుంది. మిగిలిన బ్రాండ్లపై కూడా గణనీయమైన డిస్కౌంట్లు ఇవ్వనున్నట్టు ఫ్లిప్కార్ట్ పేర్కొంది.