మెసేజింగ్ యాప్ వాట్సాప్(Whatsapp) కొత్తగా ప్రైవసీ ఫీచర్ ను విడుదల చేసింది . ఇది వాట్సాప్ కమ్యూనిటీ ని వాడే వారికి బాగా ఉపయోగపడుతుంది. కమ్యూనిటీలో ఫోన్ నెంబర్ హైడ్ చేయడానికి ఈ ఫీచర్ ను తీసుకొచ్చింది . దీంతో మీ ఫోన్ నెంబర్ కమ్యూనిటీ అడ్మిన్లకు, కాంటాక్ట్ సేవ్ చేసుకున్న ఇతర వ్యక్తులకు మాత్రమే కనిపిస్తుంది. మిగతా వారికి మీ నెంబర్ కనిపించదు. తద్వారా ఆ వ్యక్తి యొక్క ప్రైవసీ కి ఎలాంటి ఇబ్బంది రాదు అని ఆ సంస్థ పేర్కొంది.
సాధారణంగా వాట్సాప్ కమ్యూనిటీలో చాలా మంది ఉంటారు. అందులో తెలిసిన వారు ఉంటారు తెలియని వారు కూడా ఉంటారు . తెలియని వారికి మీ ఫోన్ నెంబర్ ను కనిపించకుండా చేయడానికి ఈ ఫీచర్ ను తీసుకోచ్చారు. కమ్యూనిటీ అడ్మిన్ కి మాత్రం ఫోన్ నెంబర్ కనపడేలా ఈ కొత్త ఫీచర్ ఉండబోతోంది. వారికి ఫోన్ నెంబర్ ఎల్లప్పుడూ కనిపిస్తుంది. ఈ కొత్త ప్రైవసీ ఫీచర్ Android, iOS వినియోగదారుల వర్తిస్తుందన్నారు . బీటా వినియోగదారులకు మొదటగా విడుదల చేస్తున్నారు. త్వరలో మిగతా యూజర్లకు అందిస్తామన్నారు . రానున్న రోజుల్లో ఈ ప్రైవసీ ఫీచర్ కమ్యూనిటీ గ్రూపులకు మాత్రమే కాకుండా, ఇతర గ్రూపులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తాం అని ఆ కంపెనీ తెలిపింది.
WhatsApp is rolling out a phone number privacy feature for communities!
After an initial test with a limited number of users, WhatsApp is widely rolling out the phone number privacy feature, with the ability to react to messages shared in the community!https://t.co/8TFeaPKgfW pic.twitter.com/w1ujISgKud
— WABetaInfo (@WABetaInfo) July 10, 2023