ఆదివారం మద్యం దుకాణాలకు అధికారులు సెలవు ప్రకటించారు. హైదరాబాద్ లో జరుగుతున్న బోనాల పండగ సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను ఇరవై నాలుగు గంటల పాటు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్లతో పాటు రాచకొండ కమిషనర్ పరిధిలో ఉన్న మల్కాజిగిరి, ఎల్బీనగర్, మహేశ్వరం జోన్ పరిధిలో ఒకరోజు మద్యం దుకాణాలను మూసి వేయనున్నారు.
ఎల్లుండి ఉదయం నుంచి…
ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ మధ్యం దుకాణాలు మూసివేయాలని కోరారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేయాలని కోరారు. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలపై ఆంక్షలు విధిస్తూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసులతో పాటు ఎక్పైజ్ శాఖ కూడా మద్యం దుకాణాలకు ప్రత్యేకంగా ఆదేశాలను జారీ చేసింది.