చిత్రం: బేబి (Baby)
Rating : 2.75/5
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు తదితరులు..
నిర్మాత: ఎస్కేఎన్
ప్రొడక్షన్ హౌస్: మాస్ మూవీ మేకర్స్
రచన & దర్శకత్వం: సాయి రాజేష్
సంగీతం: విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి
ఎడిటింగ్: విప్లవ్
విడుదల తేదీ: జులై 14, 2023
కథ:
వైష్ణవి (వైష్ణవి చైతన్య) హైస్కూల్ నుంచి ఆనంద్ (ఆనంద్ దేవరకొండ)ని ప్రేమిస్తుంది. వైష్ణవి ఇంజినీరింగ్ కాలేజీలో చేరగా, టెన్త్ ఫెయిలైన ఆనంద్ కాలక్రమేణా ఆటో డ్రైవర్‌గా మారుతాడు. కాలేజీలో రిచ్ కిడ్ విరాజ్ (విరాజ్ అశ్విన్), వైష్ణవిని ప్రేమించి ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. వైష్ణవి, విరాజ్ కు ఎట్రాక్ట్ అవుతుంది, అదే టైమ్ లో ఆనంద్ పట్ల ప్రేమగా కూడా ఉంటుంది. అయితే పరిస్థితుల ప్రభావం వల్ల విరాజ్ ముద్దు ప్రతిపాదనను వైష్ణవి అంగీకరిస్తుంది. అది ఆమెను ఎలాంటి ఇబ్బందుల్లోకి నెట్టింది. వైష్ణవి జీవితం ఎలా మారిపోయింది? విరాజ్ ఏమయ్యాడు? చివరికి ఆనంద్ ప్రేమలో గెలిచాడా లేదా అనేది ఈ బేబి కథ.
కథనం:
సాయి రాజేష్ దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘బేబీ’ (Baby Movie). జాతీయ పురస్కారం అందుకున్న ‘కలర్ ఫోటో’కు ఆయనే రచయిత. ఆ సినిమా తర్వాత సాయి రాజేష్ నుంచి వస్తున్న చిత్రమిది. ఇందులో విజయ్ దేవరకొండ (Anand Deverakonda) తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఓ హీరో. ‘అల వైకుంఠపురములో’ సహా కొన్ని సినిమాల్లో, ‘సాఫ్ట్వేర్ డేవ్‌లవ్‌పర్’ వెబ్ సిరీస్‌లో నటించిన వైష్ణవి చైతన్య ఈ సినిమాతో కథానాయికగా పరిచయమవుతున్నారు. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ మేనల్లుడు విరాజ్ అశ్విన్ మరో హీరో. ఎస్.కె.ఎన్ నిర్మించిన ఈ సినిమా (Baby Review) ఎలా ఉందంటే?
టెక్నీషియన్స్ :
ఈ సినిమా విషయంలో దర్శకుడు, కథకుడు సాయి రాజేష్ నీలంను అభినందించాల్సిందే. తాను ఎంచుకున్న కథ, రాసుకున్న సంభాషణలు, సినిమాని అత్యంత సహజంగా తెరపై ఆవిష్కరించిన తీరు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే సినిమాలోని పాత్రలకు అర్థవంతమైన ముగింపుని ఇస్తే బాగుండేది. దాని ప్రభావం క్లైమాక్స్‌లో కనిపించింది. ఇక ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ అందించిన నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. సినిమాకు ఆయన అందించిన పాటలు, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణ గా నిలిచాయి. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాని అత్యంత సహజంగా చూపించింది. విప్లమ్ నైషాడం ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. అయితే క్లైమాక్స్ మరింత బాగుంటే సినిమా ఫలితం మరో స్థాయిలో ఉండేది. ఆ ఒక్కటి పక్కన పెడితే బేబీ ప్రతి ఒక్కరి ప్రేమ కథని మరో సారి గుర్తు చేసి యద మదిలోయాల్లోని పాత జ్ఞాపకాల్ని కళ్లముందు కదలాడేలా చేస్తుంది.
హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి కామెడీ స్పూఫ్ లు తీసిన సాయిరాజేష్, ఈసారి ఎలాగైనా ఓ కల్ట్ ప్రేమకథ తీయాలని కంకణం కట్టుకొని ఈ సినిమా కథ-స్క్రీన్ ప్లే రాసుకున్నట్టున్నాడు. అయితే అతడి ఆలోచన విధానం సరిగ్గా లేదు. పబ్ కల్చర్, సిగరెట్లు, మద్యం లాంటి పోకడల్లో చిక్కుకొని, యువత తమ జీవితాల్ని నాశనం చేసుకోకూడదనే సందేశాన్ని ఈ సినిమాలో ఇచ్చాడు. అయితే అలా సందేశం ఇవ్వడం కోసం సాయిరాజేశ్, చాలా అసభ్యకరమైన దారిని ఎంచుకున్నాడు. సందేశం మాట అటుంచి, ఆ అసభ్యతకు యువత మరింత కనెక్ట్ అయ్యేలా ఉంది ఈ బేబి.
నిజజీవితానికి దగ్గరగా ఉండే పాత్రలను తీసుకొని, వాటితో భావోద్వేగాల్ని పండించాలనుకున్నాడు దర్శకుడు. ఈ క్రమంలో అతడు కొన్ని సన్నివేశాలు బాగానే రాసుకున్నాడు కానీ, పాత్రల చిత్రణ, వాటి ప్రవర్తనపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టినట్టు కనిపించలేదు. దీంతో తెరపై కొన్ని సందర్భాల్లో ఓ రకమైన గందరగోళం, అనిశ్చితి కనిపించింది.
ప్లస్:
ఆనంద్‌తో పాటు విరాజ్‌కు ప్రేమను వైష్ణవి యాక్సెప్ట్ చేసినట్లుగా విరామంలో ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌పై ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని కలిగించారు డైరెక్టర్. ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీని కంటిన్యూ చేసే క్రమంలో వైష్ణవి ఎదుర్కొనే సంఘర్షణతో సెకండాఫ్ రాసుకున్న విధానం బాగుంది. విరాజ్, వైష్ణవి డేటింగ్ సీన్స్‌ను బోల్డ్‌గా నడిపిస్తూనే అందులో నుంచి కావాల్సినంత ఎమోషన్స్ క్వారీ చేశారు. తన ప్రేమ విషయంలో వైష్ణవి తీసుకున్న డెసిషన్ తో సర్ప్రైజింగ్ క్లైమాక్స్‌తో సినిమాను ఎండ్ చేశారు.
మైనస్:
నిడివి ఈ సినిమాకు కొంత మైనస్‌గా మారింది. దాదాపు సినిమా మూడు గంటల లెంగ్త్ ఉంది. ముఖ్యంగా విరాజ్, వైష్ణవి లవ్ ట్రాక్, ఇంజినీరింగ్ కాలేజీ ఎపిసోడ్స్ కాస్త బోర్‌గా సాగిన ఫీలింగ్ కలుగుతుంది.
విశ్లేషణ:
మొదటి ప్రేమకు మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడుతుంది` అనే ప్రధాన కాన్సెప్ట్‌తో ముక్కోణపు ప్రేమకథగా రూపొందిన సినిమా ఇది. ఆ కాన్సెప్ట్ నేపథ్యంలోనే సినిమా కథ, కథనాలని దర్శకుడు సాయి రాజేష్ నీలం రూపొందించాడు. స్కూల్ డేస్‌లో ఎట్రాక్షన్ కారణంగా ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య మొదలైన ప్రేమకథ..వారిద్దరు ఎదుగుతున్న క్రమంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? ..ప్రేమ కథ ఎన్ని మలుపులు తిరిగింది?..చివరికి వీరి కథ ఎలా సుఖాంతమైంది అన్నది ప్రధాన కథ. ప్రతి యువకుడి జీవితంలో ఏదో ఒక సందర్భంలో చిన్న నాటి ప్రేమ కథలు ఉంటాయి.
అవి ఇప్పటికీ వారి మనసుని వెంటాడుతుంటాయి. కొన్ని పెళ్లి పీటల దాకా వెళితే..మరి కొన్ని మాత్రం మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటాయి. బయటికి చెప్పుకోలేక కొంత మంది ఆ ఫీలింగ్స్లోనే బ్రతికేస్తుంటారు. కొంత మంది మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. కొన్ని మాత్రం విషాద ప్రేమకథలుగా మనసుని మెలిపెట్టేస్తుంటాయి. అలాంటి హృద్యమైన ప్రేమకథతో రూపొందిన సినిమానే `బేబీ`. ప్రతీ ఒక్కరి జీవితంలో ఇలాంటి ప్రేమ కథలు కామన్..అలాంటి కథని అంతే ప్రభావ వంతంగా తెరపై ఆవిష్కరించారు దర్శకుడు సాయి రాజేష్ నీలం. నేటి యువ తరానికి, ప్రేమ కథల జ్ఞాపకాల్లో ఉన్న వారికి బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. సినిమాలో ఉన్న చాలా సన్నివేశాలు నేటి తరాన్ని ఆకట్టుకుంటాయి. భగ్న ప్రేమికుడిగా ఆనంద్ కోణం నుంచి కథని మొదలు పెట్టిన తీరు బాగుంది. అక్కడే దర్శకుడు నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు. వైష్ణవి- ఆనంద్ ల ప్రేమకథని నడిపించిన తీరు బాగుంది. అయితే ఆ ఎపిసోడ్ నిడివి కాస్త తగ్గిస్తే బాగుండేది. పాటలు లేకుండా ఇద్దరి మధ్య హావ భావాలతో కథని నడిపించిన తీరు బాగుంది.
రేటింగ్: 2.75/5