- #Thandatti : సీనియర్ నటుడు పశుపతి నటించిన తాజా కామెడీ-థ్రిల్లర్ చిత్రం తాండట్టి. ఈ చిత్రం జూన్ 23, 2023న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో పదవీ విరమణ అంచున ఉన్న కానిస్టేబుల్ సుబ్రమణి, ఓ కేసులో తప్పిపోయిన ఒక ముసలావిడని కాపాడే క్రమంలో కష్టాల సుడిగుండంలో చిక్కుకొని దాని నుంచి ఎలా బయటపడతాడు అనేదే ఈ చిత్ర కథాంశం. ఈ చిత్రం జులై 14 న అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో (OTT Releases) తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ కానుంది.
2. Mayabazaar For Sale: గౌతమి చల్లగుల్లా దర్శకత్వం వహించిన ఈ సినిమా లో నవదీప్, నరేష్, ఈషా రెబ్బా, మెయియాంగ్ చాంగ్ మరియు రవి వర్మ ప్రధాన పాత్రలు పోషించారు.ఈ సినిమాకు రానా దగ్గుబాటి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా జులై 14 న zee 5 లో స్ట్రీమింగ్ కానుంది.
3. #TransformersRiseOfTheBeasts: ఈ సినిమా హాలీవుడ్ నిర్మాణ సంస్థ హస్బ్రో యొక్క ట్రాన్స్ఫార్మర్స్ టాయ్ లైన్ ఆధారంగా 2023లో విడుదలైన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ ఇది ట్రాన్స్ఫార్మర్స్ లైవ్-యాక్షన్ ఫిల్మ్ సిరీస్‌లో ఏడవ సినిమా మరియు బంబుల్బీ (2018)కి సీక్వెల్ మరియు ట్రాన్స్ఫార్మర్స్ (2007)కి ప్రీక్వెల్‌గా విడుదల అయ్యింది. ఈ సినిమా జులై 14 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.
4. #TheTrial : సుపర్ణ్ వర్మ దర్శకత్వంలో కాజోల్ నటించిన వెబ్ సిరీస్ ‘ది ట్రయల్’ జూలై 14న డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ అవుతుంది.