బంగారం ధరలు తగ్గుతాయని భావించే వారికి గత రెండు రోజులుగా ఉసూరుమనిపిస్తుంది. ధరలు పెరగడం లేదు. తగ్గడం లేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. బంగారం ధర ఇప్పటికే భారీ స్థాయికి చేరుకోవడంతో తగ్గుతుందన్న ఆశతో చాలా మంది మదుపరులు ఆశగా ఎదురు చూస్తున్నా ఫలితం లేదు. బంగారం ధరలు సహజంగా ఆషాఢమాసంలో తగ్గే అవకాశాలున్నా అది కూడా కన్పించడం లేదు. రానున్నది శ్రావణ మాసం కావడంతో ధరలు పెరిగేదే తప్ప తగ్గేది ఉండదు. అందుకే బంగారం కొనుగోలుచేయాలనుకునే వారు నిరాశ చెందుతున్నారు.
పెళ్లిళ్ల సీజన్…
బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా -ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతుండటం, భారత ప్రభుత్వం దిగుమతులను తగ్గించడం వంటి కారణాలతో పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కారణాలు ఏమైనప్పటికీ ధరలు మాత్రం దిగి రావడం లేదు. రానున్నది పెళ్లిళ్ల కాలం కావడంతో డిమాండ్ ఎక్కువై ధరలు మరింత పెరిగే అవకాశముందన్న నిపుణుల హెచ్చరికలు సామాన్య, మద్యతరగతి ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
స్థిరంగా బంగారం…
ఈరోజు కూడా బంగారం, వెండి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై వేలుగా కొనసాగుతుంది. 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,000 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 81,800 రూపాయలుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో సయితం ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బంగారం ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదకపోగా, పెరిగుతాయన్నది నిపుణుల అంచనాగా ఉంది.