బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో? తగ్గుతాయో చెప్పలేం. తగ్గినప్పుడు సంతోషపడతాం. పెరిగినప్పుడు బాధపడుతుండటం మామూలు. ప్రపంచ వ్యాప్తంగా పసిడికి ఉన్న డిమాండ్ అలాంటిది. బంగారం అంటేనే స్టేటస్ సింబల్ గా మారిపోయింది. ఎంత బంగారం ఉంటే అంత గొప్పవారన్న సామెత ఇప్పుడు అందరి నోటా వినిపిస్తుంది. కానీ రాను రాను బంగారం ధరలు పెరిగి పోవడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు బంగారం భారంగా మారిపోయింది.
పెట్టుబడిగా…
కొనే స్థోమత లేక కొందరు ఆశగా చూడటం తప్ప ఏమీ చేయలేక పోతున్నారు. అలాగే మరికొందరు దానిని పెట్టుబడిగా చూస్తూ అధిక మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై ఆంక్షలు పెట్టడం కూడా ధరలు పెరగడానికి ఒక కారణంగా చెప్పాలి.
ఈరోజు ధరలు…
ఈరోజు దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై 120 రూపాయలు పెరిగింది. అలాగే వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధరపై 300 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,100 రూపాయలుగా ఉంది. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,100 రూపాయలకు చేరుకుంది. ఇక కిలో వెండి ధర 78,000 రూపాయలు పలుకుతుంది.