బంగారం ధర తగ్గిందంటే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. ముఖ్యంగా మహిళలకు బంగారాన్ని కొనుగోలు చేసినా చేయకపోయినా ఆ వార్తను మజా చే్స్తారు. రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు తగ్గితే ఎగిరి గంతేశావాళ్లు అనేక మంది ఉన్నారు. ధరలు తగ్గినప్పుడు ఎక్కువ మంది కొనుగోళ్ల కోసం ఎగబడుతుంటారు. ఇంట్లో వివాహాలే కాదు ఏ శుభకార్యం ఉన్నప్పటికీ బంగారం కొనుగోలు చేయడం ఈరోజుల్లో తప్పనిసరిగా మారింది. అందుకే బంగారానికి గిరాకి పెరిగింది.
గోల్డ్ బాండ్స్ పట్ల…
ప్రధానంగా విదేశాల్లో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయరు. గోల్డ్ బాండ్స్ మాత్రమే అక్కడ ఎక్కువగా కొనుగోలు చే్స్తుంటారు. భద్రతపరంగా, పెట్టుబడి పరంగా వారు ఎక్కువగా గోల్డ్ బాండ్స్ వైపు మొగ్గు చూపుతుంటారు. కానీ ఇండియాలో అందునా దక్షిణ భారత దేశంలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం అలవాటు. అంతే తప్ప గోల్డ్ బాండ్స్ అంటే కూడా చాలా మందికి తెలియదు. వాటిపై సరైన అవగాహన లేకపోవడంతో బంగారు ఆభరణాలనే ఎక్కువగా కొనుగోలుచేస్తారు.
నేటి ధరలు…
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధరపై మూడు వందల రూపాయల వరకూ తగ్గింది. కిలో వెండి ధరపై ఆరు వందల రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం మార్కెట్ లో 55,400 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,440 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర భారీగా తగ్గి 79,000 రూపాయలకు చేరుకుంది.