బంగారం ధరలు మరింత ప్రియం కానున్నాయి. రానున్నది పెళ్లిళ్ల సీజన్. ఇంకా ధరలు పెరుగుతాయి. అందుకే ధరలు మరింత పెరగక ముందే బంగారం కొనుగోలు చేసేందుకు కొనుగోలు దారులు ఉత్సాహపడుతున్నారు. సహజంగా ప్రతి భారతీయుడి ఇంట్లో వివాహ శుభకార్యాలకు బంగారాన్ని కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తుంది. బంగారం ఎంత పెడితే అంత స్టేటస్ సింబల్ గా చూస్తుండటంతో బంగారానికే భారతీయులు అధిక ప్రాధాన్యత ఇస్తారు.
పెట్టుబడిగా…
భూమి, బంగారం ఈ రెండింటిపై పెట్టిన పెట్టుబడికి నష్ఠం ఉండదన్న ఆలోచనతో అనేక మంది వీటిపై పెట్టుబడులు పెడతారు. అది కూడా బంగారం కొనుగోళ్లు పెరగడానికి కారణమయింది. దక్షిణ భారత దేశంలో బంగారు ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అందుకే వీధికొక్క జ్యుయలరీ దుకాణం వెలిసింది. కొత్త కొత్త డిజైన్లతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటూ తమ అమ్మకాలను పెంచుకుంటున్నాయి. కొత్త డిజైన్లు మార్కెట్ లోకి వస్తే చాలు కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు.
ధరలు ఇలా…
అందుకే బంగారం ధరలు తగ్గితే సంబరపడిపోతారు. తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,150 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,160 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో 78,000 రూపాయలు పలుకుతుంది.