జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సర్వే పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ నెల 26వ తేదీ వరకూ ఎలాంటి సర్వేలు నిర్వహించవద్దని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించింది. ఏదైనా సమస్యల పరిష్కారాల కోసం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు కోరింది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సర్వే నిర్వహించవద్దని కోరుతూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
జ్ఞానవాపి మసీదు…
దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. మరో రెండు రోజుల పాటు ఎలాంటి సర్వేలు చేయవద్దని ఆదేశించింది. సర్వే చేయడం కోసం ఈరోజు జ్ఞానవాపి మసీదు ప్రాంగణానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సిబ్బంది వచ్చారు. అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించేందుకు ముస్లిం కమిటీకి కొంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో నేడు జరగాల్సిన జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సర్వే నిలిచిపోయింది.