బ్యాంకులకు సెలవులంటే ముందుగా కంగారు పడేది ఖాతాదారులు. వ్యాపారులకు కూడా బ్యాంకు సెలవులు ఎక్కువుంటే ఇబ్బంది. తమ కార్యకలాపాలను కొనసాగించుకోవడానికి ప్రస్తుతం అకౌంట్ ఆపరేషన్ సులువుగా మారినప్పటికీ పెద్దయెత్తున లావాదేవీలు చేసేవారు బ్యాంకులకు వెళ్లక తప్పదు. దీంతో పాటు పింఛనుదారులు, నెట్ అందుబాటులో లేని వారు విధిగా తమ ఖాతాలో నగదును జమ చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్లాల్సి వస్తుంది.
ఆర్బీఐ విడుదల చేసిన…
అయితే ఏ నెలకు ఆ నెల రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్యాంకులకు ఉండే సెలవులను ప్రకటిస్తుంటుంది. తాజాగా ఆగస్టు నెలకు సంబంధించి బ్యాంకులకు సంబంధించిన సెలవు దినాలను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆగస్టు నెలలో బ్యాంకులు ఎక్కువగా సెలవులు కారణంగా తెరుచుకునే అవకాశాలు లేవని ఆర్బీఐ విడుదల చేసిన రిపోర్టును బట్టి అర్థమవుతుంది. నెలలో దాదాపు సగం రోజులు సెలవు దినాలుగా కనిపిస్తున్నాయి.
సగం రోజులు…
ఇప్పటికే రెండో శనివారంతో పాటు ఆదివారం బ్యాంకులకు సెలవు. దీంతో పాటు ఆగస్టు పదిహోనో తేదీ స్వాతంత్ర్య దినోత్సవం, ఆగస్టు ఆరోతేదనీ పార్సీ నూతన సంవత్సరం కావడంతో ముంబయి, నాగూర్, బేలాపూర్ లలో బ్యాంకులకు సెలవు. ఆగస్టు 8వ తేదీన రమ్ ఫాట్ కారణంగా గ్యాంగ్ టక్ లోని టెండాంగ్ లో బ్యాంకులకు హాలిడే ఇచ్చారు. ఆగస్టు 18న శ్రీమంత శంకర్‌దేవ్ తిధి కారణంతో గౌహతిలోనూ, ఆగస్టు 28న ఓనం కారణంగా కొచ్చి, తిరువనంతపురంలో, ఆగస్టు 30న రక్షాబంధన్ కారణంగా, ఆగస్టు 31న శ్రీనారాయణ గురుజయంతి సందర్భంగా డెహ్రాడూన్, గ్యాంగ్ టక్, కాన్పూర్, లక్నో, తిరువనంతపురంలలో సెలవులను ప్రకటించారు. ఖాతాదారులు వీటిని గమనించుకోవాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కోరింది.