తెలంగాణలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈరోజు నుంచి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో…
రేపటి నుంచి 26,27 తేదీల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ ఉరుములతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశమున్నాయని వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. రానున్న మూడు రోజల పాటు ప్రజల అప్రమత్తంగా ఉండాలని, గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది.కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ కూడా జారీ చేసింది.