X.com: ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) ఏది చేసిన సంచలనమే. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయిన మస్క్ గత ఏడాది ట్విట్టర్ ను కొనుగోలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ట్విట్టర్ ను దక్కించుకున్న మొదటి రోజు నుంచే ట్విట్టర్ సంస్థలో అనేక మార్పులకు ఆయన పూనుకున్నారు. ట్విట్టర్ సంస్థ నుంచి సగం మంది ఉద్యోగుల్ని తొలగించిన మస్క్ తర్వాత ట్విట్టర్ బ్లూ (Twitter Blue) పేరుతో బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ తీసుకొచ్చారు. తాజాగా ఆయన ఏకంగా ట్విట్టర్ పక్షి లోగో నే మార్చేశారు. ఇక మీదట ట్విట్టర్ సంస్థ(twitter.com) కొత్త డొమైన్లో ఎక్స్ డాట్ కామ్ (X.com) అందుబాటులోకి రానుంది అని తెలిపారు.
https://t.co/bOUOek5Cvy now points to https://t.co/AYBszklpkE.
Interim X logo goes live later today.
— Elon Musk (@elonmusk) July 23, 2023
20 ఏళ్ళ నాటి ప్లాన్ అమలు..!
ఎలాన్ మస్క్ ఎక్స్ డాట్ కామ్ (X.com) ఈనాటిది కాదు. దాదాపుగా 20 ఏళ్ళ క్రితమే X.com డొమైన్ ను రిజిస్టర్ చేసారు. అయితే ఆ డొమైన్ 2002లో ఎలాన్ మస్క్ పే పాల్ (Pay Pal) కంపెనీ నుంచి వైదొలగడంతో X.com ఆయన చేతుల్లో నుంచి జారిపోయింది. అయితే ఆ డొమైన్ ను పే పాల్ వద్ద నుంచి 2017 లో ఎలాన్ మస్క్ తిరిగి కొనుగోలు చేసారు.ఎలాన్ మస్క్ X.com స్థాపించింది కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ పేమెంట్స్ కోసమే. 20 ఏళ్ళ క్రితమే ఆయన X.com ను ప్రపంచంలోనే అతి పెద్ద పే మెంట్స్ కంపెనీ చేయాలనీ కల కన్నారు. ఇప్పుడు ఆయన కళను నెరవేర్చుకునేందుకు ప్రపంచంలోనే అతి పెద్ద సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ ను వాడుకోనున్నారు. ఇక మీదట X.com కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫారం మాత్రమే కాకుండా, ఆడియో , వీడియో , ఆన్లైన్ పే మెంట్స్ / బ్యాంకింగ్ చేసేందుకు వీలుగా తీర్చిదిద్దనున్నారు.
https://t.co/J8hckYiNgo logo from 1999 ✖️ pic.twitter.com/Wftchghqvn
— DogeDesigner (@cb_doge) July 23, 2023