బంగారం ఎప్పుడూ అంతే. పెరిగితే భారీగా పెరుగుతుంది. తగ్గితే స్వల్పంగా తగ్గుతుంది. తగ్గడం ఎంత తక్కువ సార్లో.. పెరగడం అన్ని ఎక్కువ సార్లు ఉంటుంది. ఇక స్థిరంగా బంగారం ధరలు కొనసాగుతుండటం కూడా కొనుగోలుదారులకు శుభవార్త లాంటిదే. బంగారానికి వన్నె తగ్గన్నట్లుగానే దాని డిమాండ్ కూడా ఎప్పటికీ తగ్గదు. ప్రధానంగా మహిళలు అత్యంత ఇష్టపడే వస్తువు కావడం, భారతీయ సంప్రదాయంలో ఇక భాగం కావడం, పెట్టుబడిగా మదుపరులు కొనుగోలు చేస్తుండటంతో ఎవర్ గ్రీన్ లో మార్కెట్ కింగ్ గా గోల్డ్ వెలుగొందుతూనే ఉంటుంది.
రానున్నకాలంలో…
రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు మరింత ప్రియం అయ్యే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.22క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు అరవై వేలకు చేరుకునే రోజు ఎంతో దూరం లేదన్నది విశ్లేషకుల అంచనా.
తగ్గిన వెండి…
తాజాగా మూడో రోజు కూడా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధర మాత్రం తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,150 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,160 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధరపై ఐదు వందల రూపాయల వరకూ తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 77,500 రూపాయలు పలుకుతుంది.