చెప్పేది అదే.. బంగారం ధరలు పెరిగితే అంతలా పెరుగుతాయి. తగ్గితే మాత్రం స్వల్పంగానే ఉంటాయి. ధరలు పెరిగాయంటే కొనుగోలుదారుల గుండెల్లో గుభేలు మనేలా ఉంటాయి. రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. అందుకే సీజన్ తో సంబంధం లేకుండా కొనుగోలు చేయడం కొనుగోలుదారులు ఇటీవల కాలంలో అలవాటుగా మార్చుకున్నారు. అందుకే పసిడికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.
మార్కెట్ ధరలు….
అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం, బంగారం దిగుమతులను కేంద్ర ప్రభుత్వం తగ్గించడం వంటి కారణాలతో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందునా దక్షిణాదిన ఎక్కువగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తుంది. ఇంట్లో వివాహంతో పాటు ఏ శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేయడం ఒక సంప్రదాయం.
నేటి ధరలు….
దీనిని ఆసరాగా చేసుకుని వ్యాపారులు కూడా ధరలు పెంచుతూ వెళుతున్నారు. కొత్త కొత్త డిజైన్లతో మగువలను ఆకట్టుకుంటున్నారు. ఈరోజు బంగారం ధరలు భారీగా పరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.160లు పెరిగింది. వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి. కిలో వెండి ధర నాలుగు వందల రూపాయల వరకూ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,150 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,160 రూపాయలకు చేరుకుంది. ఇక కిలో వెండి ధర 77,400 రూపాయలుగా నమోదయింది.