బంగారం ధరలు మళ్ల ీ పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా బంగారం ధరలు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ రాకముందే ధరలు పెరుగుతుండటంతో కొనుగోలు చేయలేక అవస్థలు పడుతున్నారు. మధ్యతరగతి ప్రజలకు బంగారం భారంగా మారింది. శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేయాలా? వద్దా? అన్న మీమాంసలో పడ్డారు.
భారీగా పెరిగి…
బంగారం ధరలు ఎప్పుుడూ పెరుగుతూనే ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా – ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కారణంగా ధరల్లో హెచ్చు తగ్గులుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దిగుమతులను కూడా తగ్గించడం బంగారం ధరలు పెరగడానికి ఒక కారణంగా చూపుతున్నారు.
వెండి కూడా…
ఈరోజు దేశ వ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధర కూడా అమాంతం పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధరపై 330 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వెయ్యి రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం మార్కెట్ లో 55,450 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,490 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి అయితే 78,400 రూపాయలకు చేరుకుంది.