బంగారం ధరలు తగ్గినప్పుడు అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. కొనకపోయినా.. బంగారం మనకు అందుబాటులోకి వచ్చిందని సంతోషపడటం మానవనైజం. అందుకే బంగారం ధరలు తగ్గినప్పుడు కొనుగోళ్లు పెద్దగా పెరగకపోయినా మరికొంత తగ్గుతుందేమోనన్న ఆశ కొనుగోలుదారుల్లో ఉంటుంది. బంగారం పేదలకు, మధ్యతరగతికి భారంగా మారింది. అసలు కొనే పరిస్థితి లేదు. గ్రాము బంగారం కొనుగోలు చేయాలన్నా వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది.
పెట్టుబడిగా…
బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు చెప్పొచ్చు కానీ పెరుగుదల శాతం ఎక్కువగా ఉండటం వల్లనే ప్రతి ఏడాదికి బంగారం ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి పది గ్రాముల బంగారం ధర అరవై వేల రూపాయలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం పెట్టుబడిగా చూసేవారు మాత్రం దానిని కొనుగోలు చేసి మదుపు చేసుకుంటున్నారు.
ధరలు ఇలా…
తాజాగా దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా మరింత తగ్గాయి. గత రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు భారీగానే తగ్గడంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పది గ్రాముల బంగారం ధరపై 350 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధర పై రెండు వేల రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,100 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,110 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 76,400 రూపాయలుగా నమోదయింది.