ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తమ కొత్త స్టోర్లో ప్రారంభించింది. కాశ్మీర్లోని శ్రీనగర్లో డాన్ లేక్ లో ఈ స్టోర్ ని ప్రారంభించారు. కొత్త స్టోర్ ఓపెన్ చేయడంలో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా.. ఈ స్టోర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే నీటిపై తేలుతూ వినియోగదారులకు అవసరమైన వస్తువులను డెలివరీ చేయడమే. ఈ స్టోర్ నీటిపై తేలుతూ ఉండడంతో స్టోర్ ను నడిపేందుకు వారు ఒక హౌస్ బోట్ ని కూడా ఏర్పాటు చేశారు.
ఈ హౌస్ పోర్ట్ ను నడిపేందుకు ముర్తాజా ఖాన్ కాశీ అనే వ్యక్తిని తమ ఏజెంట్గా నియమించుకున్నారు. ఇతను ఆ హౌస్ బోర్డ్ తో దాల్ లేక్ మరియు నిజిన్ లేక్ పరిసర ప్రాంతాల్లో వస్తువులను డెలివరీ చేస్తాడట. అమెజాన్ “ఐ హావ్ స్పేస్” లో భాగంగా ఈ సరికొత్త మెయిల్ రాయిని తాము చేరుకునట్టు తెలిపారు. ఈ మొట్టమొదటి ఫ్లోటింగ్ స్టోర్ ను అమెజాన్ కంపెనీ తీసుకువచ్చింది.
హౌస్ బోట్ నడిచే ముర్తాజా ఖాన్ కాశి మాట్లాడుతూ.. హౌస్ బోట్ అమెజాన్ డెలివరీ ఏజెంట్ గా తనని చాలా సంతోషం ఉందన్నారు. కానీ దీనివలన సీజన్లో మాత్రమే ఆదాయం వస్తుందని ఆ తర్వాత కుటుంబ పోషణ కూడా కష్టం అవుతుంది అని చెప్పారు
అమెజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ మొట్టమొదటి ఫ్లోటింగ్ స్టోర్ ద్వారా స్థానిక వ్యాపారాలు వృత్తి చెందుతాయని మార్కెట్ అనుసంధానత మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Excited to share this unique milestone. Here’s our 1st floating Amazon 'I Have Space' store – Selec Town Houseboat – Srinagar, a representation of innovation, accessibility & growth of local businesses.https://t.co/HeBDR7HDQ3 pic.twitter.com/Voz9iZjCTm
— Amit Agarwal (@AmitAgarwal) July 27, 2023