భారతదేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హార్లీ డేవిడ్సన్ 440 ను నెట్టకేలకి ఆ సంస్థ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. పాపులర్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అయినా హార్లీ డేవిడ్సన్ తొలిసారి అత్యంత తక్కువ ధరకే బైక్ రిలీజ్ చేసింది. హార్లీ డేవిడ్సన్ బైకులను ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు అలాంటివారికి ఈ బ్రాండ్ లో తక్కువ ధరలో వచ్చిన ఈ బైక్ ను కొనడం బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. హార్లీ డేవిడ్సన్ మరియు హీరో మోటో కార్ సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశాయి.
బైక్ లాంచ్ తో పాటు ప్రీ బుకింగ్ లో కూడా ప్రారంభించారు తాజాగా ఆగస్టు మూడవ తేదీ వరకు మాత్రమే ఆన్లైన్ బుకింగ్‌లు ఉన్నట్టు ఆ తర్వాత ఫ్రీ బుకింగ్‌ను మూసి వేస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది. కాబట్టి ఈ బైక్ కొనుగోలు చేయాలనుకునేవారు త్వరగా బుకింగ్ చేసుకోవాలని ఆ కంపెనీ తెలిపింది. ముందస్తుగా బుకింగ్ చేసుకున్న వారికి అక్టోబర్‌లో బైక్ డెలివరీలు చేయబడతాయని ఆ సంస్థ తెలిపింది. హార్లీ డేవిడ్సన్ ఎక్స్ 440 ప్రారంభ ధర రూ. 2.29 లక్షల నుంచి రూ. 2.69 లక్షల వరకు ఉంటుంది.
నాలుగు రంగుల్లో..
మొత్తం నాలుగు రంగుల్లో ఈ బైకులు అందుబాటులో ఉన్నాయి. వాటి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
→ హార్లీ డేవిడ్సన్ ఎక్స్ 440 మస్టర్డ్ డెనిమ్ ధర రూ. 2,29,000
→ హార్లీ డేవిడ్సన్ ఎక్స్ 440 మెటాలిక్ డార్క్ సిల్వర్ ధర రూ. 2,49,000
→ హార్లీ డేవిడ్సన్ ఎక్స్ 440 మెటాలిక్ థిక్ రెడ్ ధర రూ. 2,49,000
→ హార్లీ డేవిడ్సన్ ఎక్స్ 440 మెటాలిక్ మాటి బ్లాక్ ధర రూ. 2,69,000 గాఉంది.