కరోనా లాక్ డౌన్ తర్వాత నుంచి సినిమా థియేటర్లకు వెళ్లి సినిమా చూసే ప్రేక్షకుల కన్నా ఇంట్లో కూర్చుని టీవీలో సినిమాలు చూసే పరీక్షకులే ఎక్కువయ్యారు. అందుకు కారణం కరోనా సమయంలో వచ్చిన ఓటీటీ(OTT) ప్లాట్ఫామ్స్. ఏ సినిమా విడుదలైన కనీసం ఒక నెలలోపు ఆ సినిమా ఓటీటీ(OTT) ప్లాట్ఫామ్ మీదకు వచ్చేస్తుంది. అందువలన చాలా మంది థియేటర్లకు వెళ్లి సినిమా చూడడం కంటే ఓటీటీ(OTT)లో సినిమాలు చూడడం వైపే మొగ్గు చూపుతున్నారు.
ఓటిటీ ప్లాట్ ఫామ్ అయినా నెట్ఫ్లిక్స్(NETFLIX) వినియోగదారుల పాస్వర్డ్(Password) షేర్ చేసుకునే విసులుబాటును ఆపివేసింది.తాజాగా ఓటీటీ(OTT) ప్లాట్ ఫామ్ అయినా డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney+ Hotstar) వినియోగదారులకు షాక్ ఇవ్వబోతుందని చెప్పవచ్చు. అది ఏంటంటే వినియోగదారులు పాస్వర్డ్ షేర్ చేసుకునే విధానంపై ఆంక్షలు విధిస్తోంది.
అయితే నెట్ఫ్లిక్స్(NETFLIX) లా పూర్తిగా నిలిపివేయకుండా ప్రీమియం యూజర్లకు కేవలం నాలుగు డివైస్ లకు మాత్రమే షేర్ చేసుకునే పరిమితిని విధించబోతోంది.దీనిని మొదటగా భారత్ తో పాటు మరికొన్ని దేశాల్లో అమలు చేయదలిచారు, తర్వాతి దశలో మిగతా దేశాల్లో కూడా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney+ Hotstar) ప్రీమియం వినియోగదారులు తమ పాస్వర్డ్ తో 10 డివైస్ లలో లాగిన్ అయ్యే వీలుంది ఒకేసారి నాలుగు డివైస్లలో కంటెంట్ చూసేందుకు కూడా అనుమతి ఉంది అయితే దీన్ని త్వరలో నాలుగు డివైస్ లలో మాత్రమే లాగిన్ అయ్యే లా విధించనున్నట్టు సమాచారం.
అయితే ఈ ప్రక్రియను తోలుతా ఆ కంపెనీ ప్రయోగాత్మకంగా నిర్వహించబోతున్నట్లు. ఈ ఏడాది చివరిలోగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ నిర్ణయం వల్ల కొంతమంది వినియోగదారుడు ఇతర సుబ్స్క్రిప్షన్(Subscriptions) ఆధారపడరని తద్వారా తమకు సబ్స్క్రైబర్స్( Subscribers) సంఖ్య కూడా పెరుగుతుందని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రతినిధి పేర్కొన్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నెలవారి ప్లాన్లు కూడా ఈ మధ్యనే సవరించిన విషయం మనకు అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్లాన్లు ఇలా ఉన్నాయి
- ఏడాదికి రూ. 899, రూ.1499 గా ఉండగా
- నెలకు రూ.299 గా ఉంది.