బంగారం అంటేనే మహిళలకు మహా ప్రీతి. పసిడిని కొనుగోలు చేయాలని ప్రతి మహిళ తహతహలాడుతుంటుంటారు. తమ వద్ద ఉన్న కొద్దిపాటి సొమ్ముతోనైనా సరే గ్రాము బంగారాన్ని అయినా కొనుగోలు చేయడమే లక్ష్యంగా పనిగా పెట్టుకుంటారు. బంగారం తమ ఇంట్లో ఉంటే భరోసాగా ఉంటుందన్న నమ్మకమే వారిని కొనుగోళ్లవైపు నడిపిస్తుంది.
ధరలు పెరుగుతాయని…
బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం వంటి కారణాలతో బంగారం ధరలు ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులుత కనపడుతుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ ఏడాది పది గ్రాముల బంగారం అరవై వేలు దాటుతుందన్న అంచనాలు కూడా వినపడుతున్న నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు మరింత పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.
నేటి ధరలు…
తాజాగా బంగారం ధరలు గత కొద్ది రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈరోజు మాత్రం స్వల్పంగా తగ్గడం కొనుగోలుదారులకు కొంత ఊరటకలిగించే అంశం. పది గ్రాముల బంగారం ధరపై వంద రూపాయలు తగ్గింది. వెండి ధర మాత్రం నిలకడగా కొనసాగుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,400 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,430 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర 77,000 రూపాయలుగా ఉంది.