హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హబ్సిగూడలోని అన్ లిమిటెడ్ షోరూంలో ఈరోజు తెల్లవారు జామున పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిపి పడుతుండటంతో స్థానికులు అగ్రిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అంటున్నారు.
అన్ లిమిటెడ్ షోరూంలో…
మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తుంది. దుస్తులు, చెప్పులతో సహా అన్ని రకాల వస్తువులు ఉండటంతో సులువుగా మంటలు అదుపులోకి రావడం లేదని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. చుట్టుపక్కల ప్రజలు పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పక్క షోరూంలకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పక్కనే పెట్రోలు బంక్ ఉండటంతో ప్రమాదం పొంచి ఉంది. మరో వైపు హబ్సీగూడలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.