తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఉదయం నుంచే హైదరాబాద్ లో మేఘాలు కమ్ముకున్నాయి.
ఉరుములతో కూడిన…
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, నిర్మల్, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, మేడ్చల్, వికారాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలజల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇటీవల కురిసిన వర్షాలతోనే ఇబ్బంది పడిన ప్రజలు మరోసారి వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో భయపడిపోతున్నారు.