మంత్రి మల్లారెడ్డి ఎప్పుడూ కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తుంటారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి ఎవరు ఉండాలో తాను నిర్ణయిస్తానని మల్లారెడ్డి తెలిపారు. తన నియోజకవర్గంలో అన్ని పార్టీల అభ్యర్థులను తానే నిర్ణయిస్తానని తెలిపారు. కాంగ్రెస్ నుంచి కూడా ఏ అభ్యర్థి పోటీ చేయాలో తానే నిర్ణయిస్తానని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా తనకు దోస్తులు అనేక మంది ఉన్నారన్నారు. కెఎల్ఆర్కు కూడా తానే టిక్కెట్ ఇప్పించానని మల్లారెడ్డి ఆఫ్ ది రికార్డుగా అన్నారు.
అన్ని పార్టీల అభ్యర్థులు…
రానున్న ఎన్నికల్లోనూ మేడ్చల్ నియోజకవర్గంలో అన్ని పార్టీల అభ్యర్థులను తానే ఎంపిక చేస్తానని మల్లారెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలిచేది కారు పార్టీయేనని, కేసీఆర్ హ్యాట్రిక్ విజయం తప్పదని మంత్రి మల్లారెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణ యాసలో తాను త్వరలో సినిమాలు కూడా తీస్తానని మంత్రి మల్లారెడ్డి సరదాగా అన్నారు. కేసీఆర్ రైతు రుణమాఫీ చేయడంతో ప్రతిపక్షాలకు నోట మాట లేకుండా పోయిందంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.