టమాటా ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. కిలో రెండు వందల రూపాయలు పలుకుతుంది. దీంతో వినియోగదారులు టమాటా అంటేనే భయపడిపోతున్నారు. మార్కెట్ లో కొనుగోళ్లు కూడా తగ్గిపోయాయి. కిలో రెండు వందల రూపాయలు పెట్టి కొనుగోలు చేయలేని ప్రజలు ఇతర కూరగాయలను కొనుక్కుని వెళుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో పలు మార్కెట్ లలో టమాటాలు కుళ్లిపోయి పారపోయాల్సి వస్తుందని, తమకు నష్టం వాటిల్లుతుందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
కిలో ధర…
అయితే వర్షాలు కురుస్తుండటంతో టమాటా ధర ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవని మార్కెట్ లోని వ్యాపారులు చెబుతున్నారు. దిగుబడి లేకపోవడం, టమాటా అందుబాటులో లేకపోవడంతో ధరలు మరో నెల రోజులు ఇలాగే కొనసాగే అవకాశముందని అంటున్నారు. అంతేకాదు కిలో టమాటా మూడు వందల రూపాయలకు కూడా చేరుకునే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో టమాటా ప్రియులు ధరలు తగ్గాలంటే మరికొద్దికాలం వేచి చూడక తప్పదు.