కొనుగోళ్లు తగ్గడంతో బంగారం ధరలు కూడా క్రమంగా దిగి వస్తున్నాయి. ఇప్పటి వరకూ తారాజువ్వలా పెరిగిన బంగారం ధరలు క్రమేణా దిగి రావడం ఒకరకంగా సంతోషదాయకమే. దేశంలో కొనుగోలు చేసే శక్తి ఎందరికి ఉంటుంది? పేద, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేస్తేనే ఏ వస్తువుకైనా డిమాండ్ ఉంటుంది. అలాంటి భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారం ధరలు అమాంతం పెరిగి పోవడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు బంగారం దుకాణాల వైపు చూడటం మానేశారు.
కొనుగోళ్లు లేక…
దీంతో ధరలు క్రమంగా దిగిరాక తప్పడం లేదు. వరసగా రెండు రోజుల నుంచి ధరలు భారీగానే తగ్గాయి. బంగారం ధరల్లో మార్పునకు అనేక కారణాలను మార్కెట్ నిపుణులు చెబుతున్నప్పటికీ అసలు కొనుగోళ్లు మందగిస్తే ఎలా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి విలువ, రష్యా – ఉక్రెయిన్ల యుద్ధం ఒక కారణం బంగారం ధరల్లో హెచ్చు తగ్గులకు ఒక కారణం కావచ్చు. కానీ కొనుగోళ్లు లేకుంటే ధరలు పతనం కాక మరేమవుతాయి?
వెండి భారీగా…
వరసగా రెండు రోజుల నుంచి బంగారం ధరలు దిగి వస్తున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై 450 రూపాయలు తగ్గింది. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కిలో వెండి ధరపై 2,300 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,950 రూపాయలకు చేరుకుంది. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,950 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర 78,500 రూపాయలుగా కొనసాగుతుంది.